ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'మైనింగ్ పేరిట భూములు కాజేయాలని చూస్తే ఊరుకోం'

By

Published : Jun 3, 2021, 10:14 PM IST

ఎస్సీ, ఎస్టీ రైతులకిచ్చిన భూములను మైనింగ్ పేరుతో కాజేయాలని చూస్తే..ఊరుకోబోమని కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్ హెచ్చరించారు. గతంలో పేదలకు ఇచ్చిన భూములను వైకాపా ప్రభుత్వం మైనింగ్ పేరుతో స్వాధీనం చేసుకోవాలని చూస్తోందని మండిపడ్డారు.

congress sc st cell
congress sc st cell

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి వద్ద వీకర్స్ సొసైటీ ద్వారా ఎస్సీ, ఎస్టీ రైతులకు ఇచ్చిన భూములను మైనింగ్ పేరుతో కాజేసేందుకు చూస్తున్న వారిని వదిలిపెట్టబోమని కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్ హెచ్చరించారు. ఇవాళ యడవల్లి భూముల వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీని సీఐ సుబ్బారావు.. సిబ్బందితో అడ్డుకున్నారు. సమస్యను పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ దృష్టికి తీసుకెళ్లి పోరాటం కొనసాగిస్తామని వినయ్ కుమార్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details