CM Jagan Plan to Destroy Capital Amaravati: అమరావతిని నాశనం చేసేందుకు మరో ప్లాన్.. గుట్టుగా కసరత్తు చేస్తున్న సీఆర్డీఏ అధికారులు CM Jagan Plan to Destroy Capital Amaravati: రాజధాని అమరావతిని ధ్వంసం చేసే దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నాలుగున్నరేళ్లుగా తమ ప్లాట్లను మార్చాలని అర్జీలు పెట్టుకున్నా.. వాటిని పట్టించుకోని జగన్ సర్కారు.. తాజాగా రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని వాటిని మార్చుతున్నట్లు ప్రకటించింది. జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న ఓ అధికారి రాజధాని అంశాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. భూసేకరణ ప్రకటన ఉపసంహరణ ప్రయత్నం ఆలోచన వెనుక ఆయనే కీలకంగా వ్యవహరించినట్లు తెలిస్తోంది.
భూసేకరణ ప్రకటనను వెనక్కి తీసుకుంటే, మాస్టర్‌ప్లాన్ గందరగోళంగా మారుతుంది. అమరావతిని దెబ్బతీయొచ్చన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఇదంతా చేస్తున్నట్లు రాజధాని రైతులు ఆరోపిస్తున్నారు. అమరావతి నిర్మాణానికి గత తెలుగుదేశం ప్రభుత్వం 34 వేలకు పైగా ఎకరాలను సమీకరించింది. సమీకరణలో భూములు ఇచ్చిన చాలామంది రైతులకు ప్లాట్లు ఇచ్చారు. తర్వాతి పరిణామాల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి, రాజధాని నిర్మాణాన్ని పక్కన పెట్టేసింది.
CRDA Notices to Amaravati Farmers: రాజధాని అమరావతిపై మరో కుట్ర.. ప్లాట్లను రద్దు చేసుకోవాలంటూ సీఆర్డీఏ నోటీసులు
కోర్ క్యాపిటల్‌లో భాగమైన తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాకలోనూ టీడీపీ ప్రభుత్వం భూసేకరణకు ప్రకటన ఇచ్చింది. పూలింగ్ ద్వారా పెనుమాకలో 2వేల126.39 ఎకరాలు, ఉండవల్లిలో 2వేల 41.55 ఎకరాలను సమీకరించగలిగారు. ఈ గ్రామాల్లో భూములను ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఇచ్చేందుకు, మాస్టర్‌ప్లాన్ అమలు కోసం పెనుమాకలో 660 ఎకరాలు, ఉండవల్లిలో మరో 156 ఎకరాలను సేకరించేందుకు అప్పట్లో సీఆర్డీఏ (Capital Region Development Authority) అధికారులు ప్రకటన ఇచ్చారు.
దీనిని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు అప్పట్లో కోర్టును ఆశ్రయించడంతో భూసేకరణ ప్రక్రియ నిలిచింది. దీంతో అక్కడ భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇవ్వలేదు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రెండు గ్రామాల్లో టీడీపీ హయాంలో ఇచ్చిన భూసేకరణ ప్రకటనను ఉపసంహరించే దిశగా అడుగులు పడుతున్నాయి. సేకరణలో ఉన్న భూముల క్రయవిక్రయాలపై ఇప్పటివరకు నిషేధం ఉంది.
Amaravati Farmers Movement Reached 1400 Days: జగన్ ఎంత ప్రయత్నించినా అమరావతిని కదిలించలేరు.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన రైతులు
సేకరణ నుంచి వెనక్కి వెళ్తే.. ఆ భూములపై నిషేధం తొలగిపోతుంది. రోడ్లకు మాత్రమే భూమి ఉంచుకుని మిగిలింది రైతుల స్వాధీనంలోకి వెళ్తుంది. తర్వాతి దశల్లో ఇదే విధానాన్ని మిగిలిన భూసేకరణ గ్రామాల్లోనూ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రైతులకు రెండు రోజుల నుంచి సీఆర్డీఏ (CRDA) నోటీసులు ఇస్తోంది. పూలింగ్‌లో ఇవ్వని భూముల్లో వచ్చిన ప్లాట్లకు బదులు మరోచోట ఇస్తామని, అంగీకారపత్రంపై సంతకాలు చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎసైన్డ్, అటవీభూముల్లో వచ్చిన ప్లాట్ల గురించి మాత్రం ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు.
అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు టీడీపీ ప్రభుత్వం పలు విధాలుగా కసరత్తు చేసింది. భారీ ప్రణాళికను రూపొందించింది. నివాస, విద్య, వైద్య, ఉపాధి, తదితర అవసరాలకు తగ్గట్లు తయారుచేసింది. కోర్ కేపిటల్‌లోని 29 గ్రామాల్లో భూసేకరణ ప్రకటనను ఉపసంహరించుకుంటే ఈ ప్రణాళికలకు భంగం కలుగుతుంది. మాస్టర్‌ప్లాన్ మొత్తం దెబ్బతింటుంది. దీనివల్ల రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
Jagan govt is ready to sell Amaravati lands: అమరావతి భూములను వేలానికి పెట్టిన జగన్ సర్కార్.. రాజధాని మాత్రం వద్దు