ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ మరోసారి సమావేశం.. ఎప్పుడంటే??

By

Published : Nov 8, 2022, 2:00 PM IST

BIFURACTION MEETING : తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో మరోమారు భేటీ కానుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ.. ఏపీ, తెలంగాణ అధికారులకు సమాచారం పంపించి.. సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని చెప్పింది.

BIFURCATION MEETING
BIFURCATION MEETING

TWO STATES PARTITION ISSUE : విభజన సమస్యలపై ఈ నెల 23న కేంద్ర హోంశాఖ మరోమారు సమావేశం కానుంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో మరోమారు భేటీ కానుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ.. ఏపీ, తెలంగాణ అధికారులకు సమాచారం పంపించింది. ఈనెల 23న సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని చెప్పింది. ఈ సమావేశంలో విభజన సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం.

సెప్టెంబర్ 27 జరిగిన భేటీలో 7 ఉమ్మడి అంశాలపై చర్చించిన కేంద్రం.. ఏపీకి సంబంధించిన 7 అంశాలపైనా చర్చించింది. రాజధాని నిర్మాణానికి రూ.1500 కోట్లు ఇప్పటికే ఇచ్చినట్లు చెప్పిన కేంద్రం.. మరో రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలన్న ఏపీ అధికారులకు షాక్ ఇచ్చింది. రాజధానికి నిధులు ఇవ్వొద్దని సీఎం స్వయంగా లేఖ రాసారని పేర్కొంది. విభజన అంశాలపై చర్చించే అంశాల్లో తొలిసారి అమరావతిని చేర్చింది. ఏపీ లేవనెత్తిన అన్ని అంశాలపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమచారం. గత సెప్టెంబర్ 27న ఎలాంటి నిర్ణయాలు లేకుండానే భేటీ ముగిసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details