ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చెడు వ్యసనాలకు బానిసై..ఏటీఎం కేంద్రాల వద్ద మోసాలు

By

Published : Jul 28, 2020, 9:49 PM IST

ఏటీఎం కేంద్రాల వద్ద వృద్ధులు, గ్రామీణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న పవన్ తిరుమలేశ్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పిన్ నమోదు, ఇతర సాంకేతిక సమస్యలు ఎదురైనప్పుడు ఖాతాదారులకు సహాయం పేరుతో వారి కార్డులను తీసుకుని..తన వద్ద ఉన్న నకిలీ కార్డులు ఇచ్చి బురిడీ కొట్టిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

చెడు వ్యసనాలకు అలవాటై.. ఏటీఎం కేంద్రాల వద్ద మోసాలకు పాల్పడుతూ..
చెడు వ్యసనాలకు అలవాటై.. ఏటీఎం కేంద్రాల వద్ద మోసాలకు పాల్పడుతూ..

ఏటీఎం కేంద్రాల వద్ద మోసాలకు పాల్పడుతున్న తిరుమలేశ్.. ఇప్పటివరకు 5 లక్షల 97 వేల రూపాయలను ఖాతాదారుల నుంచి కాజేశాడు. అతని వద్ద నుంచి పోలీసులు 2 లక్షల 79 వేల రూపాయలు, నకిలీ ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను వెల్లడించిన గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి... ఇంటర్ వరకు చదివిన నిందితుడు తిరుమలేశ్... చెడు వ్యసనాలకు అలవాటు పడి ఏటీఎం కేంద్రాల వద్ద మోసాలకు పాల్పడుతున్నట్లు వివరించారు. అతనిపై గతంలో 12 కేసులున్నాయని... జైలుకు వెళ్లివచ్చాక ఏటీఎం కార్డుల మోసాలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ వివరించారు. సైబర్ నేరస్థుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎవరికీ ఏటీఎం కార్డుల పిన్, ఇతర వివరాలు ఇవ్వొద్దని కోరారు. ఇలాంటి సైబర్ నేరాలపై ప్రత్యేక నిఘా పెడతామని ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details