ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోలవరం ముంపు, గోదావరి జలాల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ

By

Published : Dec 7, 2022, 8:44 PM IST

Supreme Court on Polavaram Construction: సుప్రీంకోర్టులో పోలవరం ముంపు, గోదావరి జలాల వివాదంపై విచారణ జరిగింది. పనులపై అభ్యంతరం చెప్తూ తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలు పిటిషన్లు వేశాయి. పోలవరం ముంపుపై 2 నెలల్లో జలశక్తి శాఖ తరపున నివేదిక ఇస్తామని ఏఎస్‌జీ తెలిపింది. అంతిమంగా సీడబ్ల్యూసీ ఒక మార్గాన్ని ప్రతిపాదిస్తుందన్న సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేసింది.

supreme court
supreme court

Supreme Court on Polavaram Construction: పోలవరం ముంపు, గోదావరి జలాల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై అభ్యంతరం చెప్తూ తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలు పిటిషన్లు వేశాయి. ముంపు అంచనా లేకుండా, పరిహారం ఇవ్వకుండా నిర్మిస్తున్నారని పిటిషన్లలో పేర్కొన్నాయి. తొలి భేటీలో కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం వచ్చిందని ఏఎస్‌జీ తెలిపింది. మరికొన్ని విషయాల్లో విభేదాలు ఉన్నాయని కోర్టుకు ఏఎస్‌జీ వివరించింది.

విభేదాలపై త్వరలో నివేదిక ఇస్తామని ఏఎస్‌జీ కోర్టుకు తెలిపింది. ఒడిశా లేవనెత్తిన అంశాలనే తామూ ప్రస్తావించామన్న ఛత్తీస్‌గఢ్‌ పేర్కొంది. సెప్టెంబరు భేటీ తర్వాత ఒక నివేదికను జలసంఘానికి ఇచ్చారని కోర్టు స్పష్టం చేసింది. కేంద్ర జలసంఘం నివేదికలో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఏఎస్‌జీ వివరించింది. ఇప్పటివరకు సీఎంల సమావేశం జరగలేదని కేంద్రం కోర్టుకు తెలిపింది. పోలవరం ముంపుపై 2 నెలల్లో జలశక్తి శాఖ తరపున నివేదిక ఇస్తామన్న ఏఎస్‌జీ.. సీఎంలతో భేటీ ద్వారా ఏకాభిప్రాయం వస్తుందో, రాదో చూస్తామని తెలిపింది. అంతిమంగా సీడబ్ల్యూసీ ఒక మార్గాన్ని ప్రతిపాదిస్తుందన్న సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details