ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సొసైటీ నిధులు గోల్​మాల్.. రూ.60 కోట్లు పక్కదారి..!

By

Published : Jan 15, 2023, 8:53 AM IST

కో-ఆపరేటివ్ సొసైటీ స్కామ్
Co-operative Society Scam ()

T Narasapuram Co-operative Society Scam: ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకులను కాదని మరీ అధిక వడ్డీ వస్తుందనే ఆశతో సహకార సంఘంలో దాచుకున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసమని రూ.50వేల నుంచి 50 లక్షల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేశారు. తీరా డిపాజిట్‌ గడువు ముగిశాక.. డబ్బు కావాలని కోరితే మాత్రం అధికారులు ఇవ్వడం లేదు. దీంతో ఏలూరు జిల్లా టి. నరసాపురం సహకార సంఘంలో భారీ కుంభకోణం జరిగిందని.. డిపాజిటర్లు ఆరోపిస్తున్నారు. అధికారులేమో డిపాజిటర్లకు డబ్బులు తిరిగి ఇస్తామని అంటున్నారు.

ఏలూరు జిల్లా టి. నరసాపురం సొసైటీలో నిధులు గోల్​మాల్

T Narasapuram Co-operative Society Scam: రైతుల అభ్యున్నతి కోసం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తన పరిధిలోని సహకార సంఘాలకు నిధులను మంజూరు చేయగా.. వాటిని రైతులకు వ్యవసాయ రుణాల రూపంలో సహకార సంఘాలు ఇస్తాయి. ఏలూరు జిల్లా టి.నరసాపురం సహకార సంఘంలో మాత్రం అలా జరగలేదు. టి.నరసాపురంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలైన బంధంచర్ల, కె. జగ్గవరం సహా ఇతర గ్రామాలకు చెందిన ఎంతోమంది నిధులు డిపాజిట్‌ చేయగా.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. రైతులు కాని వారికి, కిసాన్ క్రెడిట్ కార్డుల పథకం, వాణిజ్య పంటలకు రుణాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. ఇలా పలు రూపాల్లో కోట్ల రూపాయలను పక్కదారి పట్టించినట్లు డిపాజిటర్లు చెబుతున్నారు. ఇందుకు సొసైటీ కార్యదర్శిగా పనిచేస్తున్న టి. కిషోర్ కుమారే బాధ్యుడని అంటున్నారు.

ఇప్పుడున్న డిపాజిట్​కి ఒక్కో లక్ష రూపాయల బాండే ఇచ్చారు.. వడ్డీతో 40 లక్షలు రావాలండి నాకు..2నెలల నుంచి అడుగుతున్నామండి0.. ల్యాండ్ మేము డబ్బులు అవసరమని చెప్పాను.. అడిగితే సమాధానం సరిగ్గా చెప్పక.. ఇస్తాం ఇస్తామని చెప్పటమే కానీ సరిగ్గా సమాధానం చెప్పట్లేదండి.. వాసిరెడ్డి సత్యనారాయణ, బంధంచర్ల

సొసైటీలకు ప్రతి మూడు నెలలకోసారి జిల్లా సహకార ఆడిటర్లు, డీసీసీబీ అధికారులు వెళ్లి దస్త్రాలు పరిశీలించాల్సి ఉన్నా.. పదేళ్లుగా జరిగిన తనిఖీల్లో అధికారులు నిధుల గల్లంతును గుర్తించలేదని డిపాజిటర్లు చెబుతున్నారు.

బాండు వేసాము టి.నరసాపురం సొసైటీలో..తేదీ కూడా అయిపోయింది.. డబ్బులు ఇమ్మంటే ఇదుగో అదుగో అంటున్నారు.. పక్కదారి పట్టించునట్లు అర్థమవుతుందండి మొత్తం.. ఈ డబ్బు అంతా..చాలా వరకు ప్రజల సొమ్ము ఇందులో ఉన్నాయండి.. ఎవ్వరూ బయటకు రావట్లేదు కానీ అందరూ గగ్గోలు పెడుతున్నారు.. సుమారు 60 కోట్లు సొమ్ము ఇందులో ఉందని జనాలు అంటున్నారు.. ఓబిలినేని శ్రీనివాసరావు, బంధంచర్ల

సహకార సంఘంలో ఎలాంటి అవకతవకలు, కుంభకోణం జరగలేదని సొసైటీ కార్యదర్శి కిషోర్ కుమార్ చెబుతున్నారు. రుణాల రూపంలో కొంత, వ్యాపారాలపై పెట్టుబడుల రూపంలో పెట్టిన నిధులు సకాలంలో రాకపోవడంతో నిధుల చెల్లింపులో ఆలస్యమైనట్లు తెలిపారు. అన్నీ వసూలు చేసి డిపాజిట్‌దారులకు చెల్లిస్తామని చెబుతున్నారు.

సుమారు 40కోట్లు పైనే కుంభకోణం చేసినట్లు నా అభియోగం.. ఈయన 1996లో ఉద్యోగం చేసినప్పుడు ఇతను ఆస్తి ఎంత.. ఇతను ఇల్లు ఏంటి.. ఇతను పరిస్థితి ఏంటి.. ఇవాలా ఇతనికి ఎక్కడ నుంచి వచ్చాయి ఈ ఆస్తులు.. సీబీసీఐడీ ఎంక్వేరి వేసి.. డిపాజిట్ దారులకు, రైతులకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము.. బొంతు సత్యనారాయణ, కె.జగ్గవరం

సొసైటీలో జరుగుతున్న కుంభకోణాలకు కిషోర్‌ను బాధ్యుడిగా గుర్తించిన అధికారులు.. ఇప్పటికే విచారణ ప్రారంభించారు. జిల్లా అధికారులు ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న కొంత భూమినీ అటాచ్ చేసినట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details