ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉభయ గోదావరి జిల్లాల్లో 91.91 శాతం పోలింగ్ నమోదు

By

Published : Mar 14, 2021, 6:21 PM IST

Updated : Mar 14, 2021, 9:51 PM IST

రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు జరిగిన పోలింగ్ ముగిసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో 91.91 శాతం పోలింగ్ నమోదైంది. ఈ నెల 17న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు.

ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు
ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు

ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాల్లో 91.91 శాతం పోలింగ్ నమోదైంది. రెండు జిల్లాలో మొత్తం 17,467 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా.. 16,054 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 7 పోలింగ్ కేంద్రాల్లో నూరు శాతం ఓటింగ్ నమోదైంది. అమలాపురం డివిజన్​లో 94 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ డివిజన్​లో 16 మండలాల్లో ఏర్పాటు చేసిన 16 పోలింగ్ కేంద్రాల్లో 2 వేలకు పైగా ఓటర్ల తమ హక్కును వినియోగించుకున్నారు.
ఉభయ గోదావరి జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ పెట్టెలను కాకినాడ జేఎన్​టీయూలోని స్ట్రాంగ్ రూంకి తరలించారు. ఈ నెల 17న ఉదయం 7 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు.

Last Updated : Mar 14, 2021, 9:51 PM IST

ABOUT THE AUTHOR

...view details