ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రెండు పులస చేపలు @ 31 వేలు

By

Published : Sep 15, 2020, 11:05 PM IST

ఓ వ్యక్తి రెండు చేపలను 31 వేలకు కొనుగోలు చేశాడు. రెండు చేపలు అంత రేటా...? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అవి మామూలు చేపలు కాదు... పులసలు!

pulasa fish
పులస చేపలు

పుస్తెలు అమ్మి అయినా పులస కూర తినాలనేది సామెత...
అవును మరి!! గోదావరి వరదల సమయంలో కోనసీమ ప్రాంతంలో గోదావరి నది పాయల్లో దొరికే గోదావరి పులసలకు ఎనలేని రుచి ఉంటుంది. పులస చేపల కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి అధిక రేట్లు పెట్టి మరీ కొంటారు. కోనసీమ ప్రాంతంలో దిండి-చించినాడ మధ్య వశిష్ట గోదావరి నదిలో మత్స్యకారుల వలలో ఈరోజు 2 పులసలు చిక్కాయి వాటిని ఈ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి 31 వేల రూపాయలకు కొనుగోలు చేశాడు. ఒక చేప 2 కేజీల 300 గ్రాములు.. మరో చేప రెండు కేజీల నాలుగు వందల గ్రాముల బరువు ఉన్నాయి.

సాధారణంగా మత్స్యకారుడు వలలో పులస దొరికినప్పుడు అది ఎంతోసేపు ప్రాణంతో ఉండదు. కానీ ఈ రెండు చేపలు ప్రాణంతో ఉండటంతో మరీ మోజుపడి ఆ వ్యక్తి కొనుగోలు చేశాడు. ఇలా రెండు చేపలు ముప్పై ఒక్క వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేయడంతో ఔరా అంటూ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

ఇదీ చదవండి:ఏలేరు నది ఉద్ధృతికి కుంగిన వంతెన

ABOUT THE AUTHOR

...view details