ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కొత్తపేట నియోజకవర్గంలో తెదేపా నేతల గృహనిర్బంధం

By

Published : Mar 20, 2021, 9:21 PM IST

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం తెదేేపా నేతలను పోలీసులు ముందస్తు నోటీసులతో గృహనిర్బంధం చేశారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ఘనంగా స్వగ్రామం తీసుకెళ్లేందుకు తలపెట్టిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

tdp leaders house arrested in east godavari
తూర్పుగోదావరిలో తెదేపా నేతల గృహనిర్బంధం

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. అనపర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ఘనంగా స్వగ్రామం తోడ్కొని తీసుకెళ్లేందుకు తలపెట్టిన కార్యక్రమాన్ని పోలీసులు ముందస్తుగా అడ్డుకున్నారు.

రావులపాలెం మండలం గోపాలపురంలో కాపు ఐకాస రాష్ట్ర కన్వీనర్, తెదేపా సీనియర్ నాయకుడు ఆకుల రామకృష్ణను, కొత్తపేట సర్పంచ్ బూసి జయలక్ష్మీని... నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో తెదేపా అధ్యక్షులు, నాయకులకు పోలీసులు నోటీసులు అందించి గృహనిర్బంధం చేశారు. పోలీసుల చర్యలను పార్టీ నేతలు తీవ్రంగా తెదేపానేతలు తీవ్రంగా ఖండించారు.

ABOUT THE AUTHOR

...view details