ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బస్సులో ప్రాణవాయువు.. కొవిడ్ రోగులకు ఆయువు

By

Published : May 12, 2021, 6:06 PM IST

ఆక్సిజన్ కొరతతో గాల్లోనే ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇలాంటి గడ్డు కాలం నుంచి ప్రాణవాయువును ఒడిసి పట్టుకునేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నాం. అందులో భాగంగానే ఆపత్కాలంలో ఆక్సిజన్ అందించేందుకు రాజమహేంద్రవరం ప్రభుత్వ కొవిడ్ ఆసుపత్రిలో రెండు ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులోకి తెచ్చింది.

బస్సులో ప్రాణవాయువు
బస్సులో ప్రాణవాయువు

బస్సులో ప్రాణవాయువు ఏర్పాట్లు

కొవిడ్ రోగులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. బెడ్లు ఖాళీ లేక ఊపిరి అందక.. వారు పడుతున్న అవస్థలు వర్ణించలేనివి. అలాంటి వారి కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ కొవిడ్ ఆసుపత్రిలో రెండు ఆర్టీసీ ఏసీ బస్సులు ఆక్సిజన్ సిలెండర్లతో సిద్ధమయ్యాయి. కరోనా రోగుల కోసం దాదాపు మూడు గంటల పాటు తాత్కాలికంగా ఆక్సిజన్ అందిచనున్నారు. అనంతరం రోగిని ఆస్పత్రిలో చేర్చనున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details