ఆంధ్రప్రదేశ్

andhra pradesh

టీడీపీలో చేరిన మహాసేన రాజేశ్.. ఏమన్నారంటే..?

By

Published : Feb 17, 2023, 3:33 PM IST

CBN FIRES ON JAGAN : తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఎస్సీలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలపై సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు చేసే మహాసేన రాజేశ్​.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎలక్షన్స్​కు ముందు చంద్రబాబును దళిత ద్రోహిగా సీఎం జగన్‌ చిత్రీకరించారని.. అప్పుడు ఆయన మాటలు విని చంద్రబాబును అపార్థం చేసుకున్నట్లు మహాసేన రాజేశ్ వివరించారు.

Mahasena Rajesh
మహాసేన రాజేశ్

Mahasena Rajesh FIRES ON JAGAN​: వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలపై సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు చేసే మహాసేన రాజేశ్​.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఎస్సీ నేతలతో నిర్వహించిన సమావేశం అనంతరం.. రాజేశ్​కు చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2019 ఎలక్షన్స్​కు ముందు చంద్రబాబును దళిత ద్రోహిగా సీఎం జగన్‌ చిత్రీకరించారని.. అప్పుడు ఆయన మాటలు విని చంద్రబాబును అపార్థం చేసుకున్నట్లు మహాసేన రాజేశ్​ వివరించారు.

సామర్లకోటలో ఎస్సీలతో ప్రత్యేకంగా సమావేశమైన చంద్రబాబు

మహాసేన రాజేశ్: నిజమైన దళిత ద్రోహి ఎవరో త్వరగానే గ్రహించామన్న రాజేశ్​.. ఎస్సీలకు టీడీపీ హయాంలో 27 సంక్షేమ పథకాలను అమలు చేస్తే.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్‌ వాటిని రద్దు చేశారని మండిపడ్డారు. 2019లో తప్పు చేయకుండా ఉండుంటే ఈపాటికే అమరావతి నిర్మాణం పూర్తయ్యేదని వెల్లడించారు. దళితులు ఎవరి కాళ్ల మీద వారు నిలబడేలా చంద్రబాబు చేశారని కొనియాడారు. చీకటి వచ్చాకే వెలుగు విలువ తెలుస్తుందని హితవు పలికారు. జగన్‌ తుగ్లక్‌ పాలన చూశాక.. చంద్రబాబు పాలన రామరాజ్యం అనే విషయం అర్థమవుతోందని మహాసేన రాజేశ్​ అన్నారు.

చంద్రబాబు నాయుడు: రాష్ట్రంలో ఎస్సీలంతా గౌరవంగా ఉండేలా కృషి చేసిన పార్టీ తెలుగుదేశమని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎస్సీల భవిష్యత్తుకు ఎలాంటి సమాజం ఉండాలో ఆలోచన చేసి తెలుగుదేశంతో కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్సీలకు న్యాయం చేసిందెవరు,.. ద్రోహం చేసేది ఎవరు అనే అంశంపై చర్చ జరగాలన్నారు. వైఎస్సార్సీపీ గంజాయి పాలన సాగిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ఎస్సీల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు చంద్రబాబు తెలిపారు.

బాలయోగిని లోక్​సభ స్పీకర్​గానూ, ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్​గా చేసి గౌరవించినట్లు గుర్తు చేశారు. అంబేడ్కర్​ రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోనే ఇవాళ అనపర్తిలో మీటింగ్‌ పెడుతున్నామన్న చంద్రబాబు.. సైకో ఇచ్చిన ఆదేశాలతో రాజ్యాంగం కల్పించిన హక్కును పోలీసులు కాలరాయొద్దని హెచ్చరించారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రం గురించి మౌనం వహిస్తున్న మేథావులు కూడా దేశ ద్రోహులేనన్నారు. రాష్ట్రంపై అభిమానం, బాధ్యత ఉన్న విజ్ఞులెవ్వరైనా ఉంటే వైసీపీ సైకో చర్యల్ని ఖండించాలని సూచించారు. పేదల్ని లక్షాధికారుల్ని చేయటమే తన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.

"ఎస్సీలు గౌరవంగా ఉండే అవకాశం కల్పించింది టీడీపీ. ఎస్సీల బాగు కోసం కృషి చేసే టీడీపీతో కలిసి పోరాడండి. ఎస్సీలకు న్యాయం చేసిందెవరు, ద్రోహం చేసిందెవరో చర్చ జరగాలి. ఎస్సీల అభ్యున్నతికి ఎన్నో కార్యక్రమాలను టీడీపీ చేపట్టింది"-చంద్రబాబు, టీడీపీ అధినేత

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details