ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జీడి మామిడి.. నష్టాలతో రైతుల కంటతడి!

By

Published : Apr 28, 2020, 7:24 PM IST

జీడి మామిడి సాగు చేసిన రైతులు చేదు అనుభవాలు చవిచూస్తున్నారు. తోటల్లో చీడపీడల వ్యాప్తితో పూత పిందె ఎక్కడెక్కడ మాడిపోతుందోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం ఉండట్లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల జీడిమామిడి గింజలు కొనే నాథుడే లేడని కన్నీటిపర్యంతమవుతున్నారు.

jeedi mamidi
jeedi mamidi

తూర్పుగోదావరి జిల్లా.. రాజానగరం మండలంలో రైతులు జీడి మామిడి పంటను అధికంగా సాగు చేస్తున్నారు. పంట తొలి దశలో బాగానే ఉన్నా.. రానురాను తెగుళ్లు అధికమయ్యాయి. టీదోమ, అగ్గితెగులు, జీడి మామిడి పంటను తీవ్రంగా నష్టపరుస్తోంది. ఇప్పటికే తోటల్లో 80 శాతం మేర పూత, పిందె రాలిపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. జీడి మామిడి చెట్లకు పురుగు ప్రధాన సమస్య. రోజురోజుకూ ఈ సమస్యల కారణంగా చెట్లు నిర్జీవంగా మారుతున్నాయి.

కౌలు రైతులు లక్షల్లో ఖర్చుపెట్టి జీడి మామిడి పొలాలను కౌలుకు తీసుకున్నారు. అధికంగా పెట్టుబడులు పెట్టి నీరు, మందులు కొట్టినా ఫలితం లేదని రైతులు చెబుతున్నారు. ఈ సంవత్సరం నష్టమే మిగిల్చిందని..పెట్టిన పెట్టుబడి కూడా రాని తమను ప్రభుత్వమే కాపాడాలని కౌలు రైతులు వేడుకుంటున్నారు. కనీసం జీడి మామిడి గింజలనూ అమ్ముకోలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details