ఆంధ్రప్రదేశ్

andhra pradesh

High Temperature: భానుడి భగభగలు.. కె.గంగవరంలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత

By

Published : May 30, 2021, 5:25 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. యాస్ తూపాను తీరం దాటినప్పటి నుంచి జిల్లాలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కె. గంగవరంలో అత్యధికంగా 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

high temparature in gangavaram
high temparature in gangavaram

తూర్పుగోదావరి జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. యాస్‌ తుపాను తీరం దాటినప్పటి నుంచి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. కె. గంగవరం(పామర్రు)లో గరిష్టంగా 45.5 ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇదే అత్యధికం. జిల్లావ్యాప్తంగా ఉదయం 11 గంటల నుంచే వేడిగాలుల తీవ్రత మొదలై.. ఆ ప్రభావం సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతోంది. 16 మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

జూన్‌ మొదటి వారంలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కలెక్టరేట్‌కు సూచించింది. రానున్న వారంలో రోజులు జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.

ఇదీ చదవండి:అబ్బురపరుస్తున్న "లవ్"లీ మ్యాంగో!

ABOUT THE AUTHOR

...view details