ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అతి సూక్ష్మ చెంచాకు గిన్నిస్‌ గుర్తింపు..!

By

Published : Jun 27, 2021, 10:46 AM IST

తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన స్వర్ణకారుడు దొంతంశెట్టి బాల నాగేశ్వరరావు తయారు చేసిన అతి సూక్ష్మ చెంచా గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు గుర్తింపు పొందింది. చెక్కతో 3.09 మిల్లీమీటర్ల పొడవైన అతిచిన్న చెంచాను కేవలం రెండు గంటల 13 నిమిషాల వ్యవధిలో తయారు చేసినట్లు నాగేశ్వరరావు తెలిపారు.

guinness record
చెంచాకు గిన్నిస్‌ గుర్తింపు

తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన స్వర్ణకారుడు దొంతంశెట్టి బాల నాగేశ్వరరావు తయారుచేసిన అతి సూక్ష్మ చెంచాకు గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు గుర్తింపు లభించింది. ఈ మేరకు గిన్నీస్‌ వెబ్‌సైట్‌లో శనివారం వివరాలను పొందుపరిచినట్లు ఆయన తెలిపారు.

ఈ ఏడాది జనవరి 10వ తేదీన నాగేశ్వరరావు స్వచ్ఛంద సంస్థ ప్రముఖులు, అధికారుల సమక్షంలో.. చెక్కతో 3.09 మిల్లీమీటర్ల పొడవైన అతిచిన్న చెంచాను రెండు గంటల 13 నిమిషాల వ్యవధిలో తయారు చేశారు. సంబంధిత వీడియోలను గిన్నీస్‌ రికార్డు జ్యూరీకి పంపించారు. త్వరలో ధ్రువపత్రం పంపించనున్నట్లు సంస్థ సమాచారం ఇచ్చినట్లు నాగేశ్వరరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details