ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కాకినాడ ఐడీయల్​ కళాశాలలో స్నాతకోత్సవం

By

Published : Mar 18, 2020, 4:07 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఐడీయల్​ కళాశాలలో స్నాతకోత్సవం నిర్వహించారు. విద్యార్థులు ఉపాధి కల్పనపై దృష్టి సారించి నూతన ఆవిష్కరణలతో సమాజాన్ని ఎదుర్కోవాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ వైస్​ఛాన్స్​లర్ జగన్నాథరావు అన్నారు.

graduation day at ideal college in east godavari district
కాకినాడ ఐడియల్ కళాశాలలో స్నాతకోత్సవం

కాకినాడ ఐడియల్ కళాశాలలో స్నాతకోత్సవం

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి పట్టుదలతో ముందుకు సాగాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ వైస్​ఛాన్స్​లర్ జగన్నాథరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో ఐడీయల్ కళాశాలలో జరిగిన డిగ్రీ విద్యార్థుల స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. నిరంతర శ్రమ, కఠోర దీక్షతో చదివితే ర్యాంకులు వస్తాయన్నారు. విద్యార్థులు స్వయం ఉపాధి కల్పనపై దృష్టి సారించి నూతన ఆవిష్కరణలతో సమాజాన్ని ఎదుర్కోవాలన్నారు. అనంతరం విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details