ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జిల్లాలో మొదలైన ఏరువాక పనులు

By

Published : Jun 5, 2020, 5:03 PM IST

ఏరువాక పౌర్ణమి సందర్భంగా...తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామంలో వ్యవసాయ పనులు ప్రారంభించారు. కాపు కార్పోరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా ఈ కార్యక్రమంలో పాల్గొని దుక్కిదున్నారు.

eruvaka works started in east godavari dst by jakkampdi raja
eruvaka works started in east godavari dst by jakkampdi raja

రాష్ట్రమంతా పాడిపంటలతో కళకళలాడాలని రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రారంభించారు.

ముందుగా భూమి పూజ చేసి రైతన్న వేషధారణతో ఎడ్లకు నాగలి కట్టి స్వయంగా భూమిని దున్నారు. అనంతరం ట్రాక్టర్​తో భూమి దున్ని, దమ్ము చేశారు. వైకాపా ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా అమలు చేసి రైతు పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి నిలిచారన్నారు. రాజానగరం నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసి ప్రతి మండలంలోని గోదాముల నిర్మాణం వంటి పనులకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఇదీ చూడండి
ఐదేళ్లలో 30 లక్షల ఇళ్లు నిర్మించటమే లక్ష్యం'

ABOUT THE AUTHOR

...view details