ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనం.. ఇకపై ఈ వేళల్లో మాత్రమే..!

By

Published : May 31, 2021, 12:16 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయం దర్శన వేళలను మార్పు చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు.

srikalahASTI DARSHAN
srikalahASTI DARSHAN

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయం దర్శన వేళలు మార్పు చేసినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. జిల్లాలో కరోనా కేసులు అధికంగా ఉండటంతో జూన్ ఒకటి నుంచి జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ ఆంక్షలు సవరిస్తూ జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే దర్శన సమయాన్ని కుదించారు. ఆ సమయంలో మాత్రమే రాహు, కేతు పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 9 తర్వాత దర్శనాలకు అనుమతి లేదని సృష్టం చేశారు. పరోక్ష సేవలు మాత్రం యథావిధిగా కొనసాగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details