ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చిత్తూరు జిల్లాలో ముగిసిన కౌంటింగ్...వైకాపా విజయ విజయ దుందుబి

By

Published : Sep 19, 2021, 11:53 AM IST

Updated : Sep 19, 2021, 8:47 PM IST

చిత్తూరు జిల్లాలో ముగిసిన కౌంటింగ్
చిత్తూరు జిల్లాలో ముగిసిన కౌంటింగ్ ()

చిత్తూరు జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ (CHITTOOR ZPTC, MPTC NEWS) ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 11 కేంద్రాల్లో అధికారులు కౌంటింగ్ చేపట్టారు. 65 జడ్పీటీసీ స్థానాల్లో 30 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. రెండు స్థానాల్లో అభ్యర్థులు చనిపోవడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. 886 ఎంపీటీసీ స్థానాల్లో 433 ఏకగ్రీవం కాగా.. 419 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి.

చిత్తూరు జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 886 ఎంపీటీసీ స్థానాలు, 65 జడ్పీ స్థానాలు ఉన్నాయి. నామినేషన్ల సమయంలో పోటీ లేకపోవడంతో 433 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరిగిన 419 స్థానాల్లో 389 ఎంపీటీసీలను అధికార వైకాపా కైవసం చేసుకుంది. ప్రతిపక్ష తెదేపా అభ్యర్థులు 25 స్థానాల్లో విజయం సాధించారు. స్వతంత్రులు మరో స్థానాలు దక్కించుకున్నారు.

చిత్తూరు జిల్లాలో ముగిసిన కౌంటింగ్

మరోవైపు 65 జడ్పీ స్థానాలకు గాను 30 ఏకగ్రీవమయ్యాయి. కలకడ, బంగారుపాళ్యం జడ్పీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు మృతి చెందడంతో ఎన్నికలు వాయిదాపడ్డాయి. మరో 33 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా అన్నింటిలోనూ అధికార వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు.

ఇదీచదవండి.

Balapur laddu Auction: వేలంలో రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఎంతంటే..

Last Updated :Sep 19, 2021, 8:47 PM IST

ABOUT THE AUTHOR

...view details