ఆంధ్రప్రదేశ్

andhra pradesh

minister vellampally: శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దర్శించుకున్న వెల్లంపల్లి

By

Published : Jul 22, 2021, 6:45 PM IST

దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన రాహుకేతు పూజలో పాల్గొన్నారు.

vellampally
vellampally

రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తినైనా.. ప్రముఖ ఆలయాలకు పాలకమండలి ఛైర్మన్​గా నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ఆయన.. కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించే రాహుకేతు పూజలు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా నుంచి ప్రజలను రక్షించాలని దేవుణ్ని ప్రార్థించినట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా స్థానికేతరులకు ఆలయ పాలకమండలి ఛైర్మన్ కేటాయించారని విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ భక్తి భావం కలిగిన వ్యక్తులకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఛైర్మన్​గా కేటాయించవచ్చని తెలిపారు. స్థానిక శాసనసభ్యులు , నేతలతో చర్చించి ప్రభుత్వం ఆలయ పాలకమండలి ఛైర్మన్లను నియమించామన్నారు. త్వరితగతిన పాలక మండలి సభ్యులను నియమిస్తామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details