ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మద్యం మత్తులో ఇద్దరి మధ్య ఘర్షణ.. ఒకరు హతం!

By

Published : Jun 15, 2021, 12:42 PM IST

మద్యం మత్తులో జరిగిన స్వల్ప వివాదం.. హత్యకు దారి తీసింది. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో.. ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో మాట మాట పెరిగి ఘర్షణకు దిగారు. శ్రీనివాసులు అనే వ్యక్తి పెంచలయ్య అనే మరో కత్తితో దాడి చేసి హతమార్చాడు.

man murdered in alcohol intoxication at hyderabad
ప్రాణం తీసిన మద్యం మత్తు..

మద్యం మత్తులో తలెత్తిన ఘర్షణ ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో.. హైదరాబాద్​కు చెందిన పెంచలయ్య, వరంగల్​కు చెందిన శ్రీనివాసులు పని చేస్తున్నారు. ఇద్దరు ఎస్​టీవీ నగర్​లో అద్దె ఇంటిలో ఉంటున్నారు. ఇద్దరూ మద్యం సేవించిన మత్తులో మాట మాట పెరిగి ఘర్షణకు దిగారు.

మొదట పెంచలయ్య కత్తితో శ్రీనివాసులుపై దాడి చేయగా... ఆవేశంతో శ్రీనివాసులు.. పెంచలయ్యను కత్తితో గొంతు లో పొడిచాడు. ఈ ఘటనలో పెంచలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. తిరుపతి తూర్పు పోలీసులు శ్రీనివాసులుని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details