ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీఎం మీటింగ్ ఎఫెక్ట్​.. మదనపల్లి మార్కెట్​కు సెలవు..

By

Published : Nov 30, 2022, 12:33 PM IST

Madanapalle market holiday due to CM meeting: నిత్యం రైతులతో, బుట్టల నిండా టమాటలతో కళకళలాడే టమాట మార్కెట్ సీఎం రాక సందర్భంగా బోసిపోయింది. రోజు 500 మెట్రిక్ టన్నులు వరకు టమాటాలు మార్కెట్ యార్డ్​కు రైతులు తీసుకొచ్చేవారు. సీఎం బహిరంగ సభ మార్కెట్ యార్డ్ పక్కనే నిర్వహిస్తుండడంతో అధికారులు ఈరోజు సెలవు ప్రకటించారు.

Etv Bharat
Etv Bharat

సీఎం సభ కారణంగా మార్కెట్‌కు సెలవు ప్రకటించిన అధికారులు
Madanapally tomato market: నిత్యం రైతులు, బుట్టల నిండా టమోటాలతో కళకళలాడే మదనపల్లె టమాటా మార్కెట్‌... సీఎం రాక సందర్భంగా బోసిపోయింది. రోజు 500 మెట్రిక్ టన్నుల టమాటాల వరకు మార్కెట్ యార్డ్‌కు రైతులు తీసుకొచ్చేవారు. సీఎం బహిరంగ సభ మార్కెట్ యార్డ్ పక్కనే ఉండటంతో అధికారులు ఈరోజు సెలవు ప్రకటించారు. టమాటాలు తీసుకురావద్దని రైతులను కోరారు. మార్కెట్‌ యార్డును అధికారులు స్వాధీనం చేసుకుని బస్సుల పార్కింగ్‌కు కేటాయించారు. అన్నమయ్యతో పాటు చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

విద్యా దీవెన కింద లబ్ధిదారులైన విద్యార్థులతో పాటు తల్లులను వెంట తీసుకురావాలని సచివాలయ సంక్షేమ సహాయకులను ఆదేశించారు. వీరికి ప్రత్యేకంగా బస్సులు కేటాయించారు. ప్రైవేటు పాఠశాలల వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులను సీఎం సభకు జనాన్ని తరలించేందుకు వినియోగించారు. మదనపల్లె పట్టణంలోని బీటీ కళాశాల నుంచి టిప్పు సుల్తాన్‌ మైదానం వరకు దారి మధ్యలో ఉన్న దుకాణాలను బుధవారం వేకువజాము నుంచి మూసివేశారు. హెలీప్యాడ్‌ నుంచి సభావేదిక వరకు ఇనుప బారికేడ్లు, రోడ్డుకిరువైపులా కర్రలతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన దృష్ట్యా అధికారులు ముందస్తుగానే పల్లె వెలుగు సర్వీసులు రద్దు చేశారు.

ABOUT THE AUTHOR

...view details