ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యానికేతన్​లో ఘనంగా.. పట్టభద్రుల దినోత్సవం

By

Published : Jul 6, 2019, 6:11 PM IST

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్​బాబు నిర్వహిస్తున్న శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో పట్టభద్రుల దినోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన వినోద్ కుమార్ దుగ్గల్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.

పట్టభద్రులకు ధ్రువపత్రాలను అందజేస్తున్న దుగ్గల్

పట్టభద్రులకు ధ్రువపత్రాలను అందజేస్తున్న దుగ్గల్

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేటలో శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో 8వ పట్టభద్రుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ మాజీ హోం సెక్రటరీ వినోద్ కుమార్ దుగ్గల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పుట్టుకతో ఎవరు గొప్ప వాళ్ళు కారని.. గొప్ప మనసు, తెలివితేటలు ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని విద్యాసంస్థల అధినేత మంచుమోహన్ బాబు అన్నారు. దుగ్గల్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ స్థితికి రావడానికి కారకులైన తల్లితండ్రులను ఆజన్మాంతం గుర్తుంచుకోవాలన్నారు. ఈ సంవత్సరం 1310 పట్టభద్రులు దుగ్గల్ చేతుల మీదగా ధ్రువపత్రాలను పొందారు.

ABOUT THE AUTHOR

...view details