ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఒకే ఆటోలో 20 మందా?.. ప్రమాదం పొంచి ఉన్నా పట్టదా?

By

Published : Jun 18, 2020, 11:17 AM IST

కరోనా వైరస్​ను అరికట్టేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఈ మహమ్మారి వల్ల దేశంలో ఇప్పటికే వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించి కరోనా బారిన పడకుండా కాపాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ కొంతమంది ఆ మాటలను ఏ మాత్రం లెక్కచేయకుండా పెడచెవిన పెడుతున్నారు. చిత్తూరు జిల్లాలో.. 20మందికి పైగా ఒకే ఆటోలో ప్రయాణిస్తూ వెళ్తున్న ఘటన ఈ పరిస్థితికి అద్దం పడుతోంది.

ఒకే ఆటోలో 20 మంది ప్రయాణం
ఒకే ఆటోలో 20 మంది ప్రయాణం

కరోనాతో ప్రపంచం భయాందోళనలకు గురవుతున్నా కొంతమంది ఏ మాత్రం ఆ మహమ్మారిని లెక్కచేయడం లేదు. ఇలాంటి ఘటనే పూతలపట్టు - నాయుడుపేట జాతీయరహదారిపై చంద్రగిరి సమీపంలో జరిగింది. తమకేమీ పట్టదన్నట్టు ఓ ఆటోలో 20మందికి పైగా ప్రయాణిస్తున్న విజువల్స్ సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి.

భౌతికదూరం పాటిస్తున్నా.. వ్యాప్తి తగ్గని ప్రస్తుత తరుణంలో కనీసం మాస్కులు కూడా లేకుండా ఇలా ప్రయాణిస్తే తగిన మూల్యం చెల్లిచుకోవాల్సిందేనని అంటున్నారు ప్రజలు. అనవసరంగా బయటకు వస్తున్న వారిపై లాఠీలకు పనిచెప్పే పోలీసులు.... ఇలాంటి వాటిపైనా దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details