ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అదరం.. బెదరం

By

Published : Mar 1, 2019, 8:55 PM IST

విశాఖ సభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరికీ భయపడకుండా గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడేవారే నిత్యం భయపడతారని వ్యాఖ్యానించారు.

విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీ

విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీ
అవినీతి, అక్రమాలకు పాల్పడేవారే నిత్యం భయపడతారని విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కేంద్రంలో పారదర్శక పాలన అందిస్తున్నామని ప్రధాని చెప్పారు. అంకిత భావంతో, నిర్భయంగా గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. స్థానిక నాయకులు అవినీతి పనులు చేశారని ఆరోపించిన ప్రధాని.. కుటుంబపాలనను వ్యవస్థీకృతం చేశారని ఆరోపించారు.దశాబ్దాలనాటి విశాఖ రైల్వే జోన్‌ కల సాకారం చేశామన్నారు.దక్షిణకోస్తా రైల్వే జోన్‌ బాగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.రైల్వే జోన్‌ వల్ల విశాఖ మరింత ప్రగతి సాధిస్తుందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details