ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP Police Role in YSRCP Govt Angallu Incident: ఏపీలో పోలీసు రాజ్యం.. వైసీపీ రాజ్యాంగం.. ఎదురుతిరిగితే కేసులే..!

By

Published : Aug 10, 2023, 8:55 AM IST

AP Police Role in YSRCP Govt Angallu Incident: అన్నమయ్య జిల్లాలో అంగళ్లలో చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనల విషయంలో పోలీసు అధికారుల తీరు.. విస్మయానికి గురిచేస్తోంది. అధికార పార్టీ అరాచకాలకు ఎదురు తిరిగితే.. ఖాకీలే వైసీపీ అనుబంధ విభాగం అవతారమెత్తుతూ.. వైసీపీ పీనల్‌ కోడ్‌ బయటకు.. తీస్తున్నారు..! దాడి చేసినవారిని వదిలేసి.. దెబ్బలు తిన్నవారిపై రివర్స్‌ కేసులు పెడుతున్నారు..! చంద్రబాబు అంగళ్లు పర్యటన విషయంలోనూ ఇదే జరిగింది.

ap_police_role_in_ysrcp_govt_angallu_incident
ap_police_role_in_ysrcp_govt_angallu_incident

AP Police Role in YSRCP Govt Angallu Incident: వైసీపీ నాయకులు గిల్లితే గిల్లించుకోవాలి.! తిడితే పడాలి.. కొడితే భరించాలి.! దాడి చేస్తే ఒళ్లప్పగించాలి..! రెచ్చగొట్టినా గమ్మునుండాలి..! కవ్విస్తే కళ్లు మూసుకోవాలి.!! ఇదీ మన పోలీసులు చెప్పే థియరీ. కాదని.. అధికార పార్టీ అరాచకాలకు ఎదురు తిరిగితే.. ఖాకీలే వైసీపీ అనుబంధ విభాగం అవతారమెత్తుతారు. వైసీపీ పీనల్‌ కోడ్‌ బయటకు.. తీస్తారు. దాడి చేసినవారిని వదిలేసి.. దెబ్బలు తిన్నవారిపై కేసులు, రివర్స్‌ కేసులు పెడతారు..! చంద్రబాబు అంగళ్లు పర్యటన విషయంలోనూ ఇదే జరిగింది.! కవ్వించింది.. రాళ్లు రువ్వింది, దాడి చేసిందీ వైసీపీకార్యకర్తలైతే రివర్స్‌లో తెలుగుదేశం నేతలపై కేసులుపెట్టారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. అసలు అక్కడికి ఎవరెళ్లమన్నారంటూ.. ఎదురు ప్రశ్నించే దశకు వెళ్లిపోయారు పోలీసులు.

అన్నమయ్య జిల్లాలో అంగళ్లలో చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై పోలీసులు వ్యవహరించిన తీరు విస్మయం కల్గిస్తోంది. అంగళ్లు వద్ద చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చేందుకు వైసీపీ కార్యకర్తలు వచ్చారని జిల్లా ఎస్పీ గంగాధర్‌రావు చెప్పారు. వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన వైసీపీ కార్యకర్తలు.. ఇలా వెంట పడి టీడీపీ శ్రేణులపై దాడి చేస్తారా? వినతిపత్రం ఇవ్వడమంటే.. వైరిపక్షాల కార్యక్రమంలో వైసీపీ జెండాలు పట్టుకుని ఇలా అలజడి సృష్టించడమా? వినతిపత్రం ఇవ్వడమంటే.. ఇలా రాళ్లు రువ్వి పరిగెత్తడమా? వినతిపత్రం ఇవ్వడానికే వస్తే.. చంద్రబాబు గో బ్యాక్‌ అని నినాదాలు ఎలా చేశారు? రాళ్లెలా వేశారు? వినతిపత్రం ఇవ్వడమంటే.. ఇలా విధ్వంసం సృష్టించడమా?

Ramakrishna Reaction on Cases Against Chandrababu: చంద్రబాబుపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి.. లేదంటే ఉద్యమిస్తాం: రామకృష్ణ

పోలీస్‌ సర్వీస్‌లో ఎన్నో కేసులు, ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీగారు.. మీకు ఎవరైనా ఇలా వినతిపత్రాలు ఇచ్చారా..? ఈ చర్యల్ని వినతిపత్రం ఇవ్వడమంటారా? అధికార పార్టీ దురాగతాలకు కొమ్ముకాయడం అంటారా..? మన పోలీసులు ఇలా చెప్పడం ఇదేం మొదటిసారి కాదు..! మంత్రి జోగి రమేశ్‌ ఏకంగా ఉండవల్లిలోని.. చంద్రబాబు ఇంటిపైకి వైసీపీ మందను వేసుకెళ్లినప్పుడూ.. మన ఖాకీలు ఇలాంటి కథలే చెప్పారు. జోగి రమేశ్‌ చంద్రబాబుకు.. వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే టీడీపీ నేతలే దాడి చేశారని.. నిర్లజ్జగా చెప్పేశారు.

ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ను పక్కనపెట్టేసి వైసీపీ పీనల్‌ కోడ్‌ను ఫాలో అవుతున్న ఖాకీలకు.. ఇదో అలవాటుగా మారిపోయింది. అంగళ్లులో చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు విస్మయం కలిగిస్తోంది. ఎక్కడైనా దాడులు చేసినవారిపై.. కేసులు పెడతారు. వ్యక్తిగత గొడవల్లోనైనా, రాజకీయ తగాదాల్లోనైనా.. అదే సహజ న్యాయసూత్రం. కానీ.. వైసీపీ రాజకీయ రంగులు పులుముకున్న పోలీసులు.. బాధితులపైనే రివర్స్ కేసులు పెడుతున్నారు.

అంగళ్లు ఘటనే చూద్దాం! తెలుగుదేశం అధినేత చంద్రబాబు సహా.. 20 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. ఏకంగా.. హత్యాయత్నం సెక్షన్లు నమోదుచేశారు. కాకపోతే పోలీసులు ప్రాథమిక ప్రశ్నలు వేసుకోకుండా విమర్శల పాలయ్యారు. అసలు కార్యక్రమం తెలుగుదేశానిది..! అంగళ్లు మీదుగా చంద్రబాబు చిత్తూరు వెళ్తుంటే.. ఆ మార్గంలోకి వైసీపీ నాయకుల్ని ఎలా అనుమతిచ్చారు? ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన ఉందంటే.. కనీసం నాలుగైదు కిలోమీటర్ల దూరంలోకి ఎవర్నీ అనుమతించని పోలీసులు.. ప్రతిపక్ష నేత కాన్వాయ్‌కు వెళ్లే రోడ్డు పక్కకు.. వైసీపీ కార్యకర్తల్ని ఎలా అనుమతించారు.?

సీఎం పర్యటనకు కల్పించే భద్రతలో సగం భద్రతైనా.. జెడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఉండే చంద్రబాబుకు కల్పించలేకపోయారా? అసలు.. చంద్రబాబు అంగళ్లుకు చేరుకోక ముందే వైసీపీ శ్రేణులు ఆయన ఫ్లెక్సీలు చించారు. అప్పుడే కట్టడి చేసి ఉంటే.. ఉద్రిక్తతలకు అసలు అవకాశమే ఉండదుకదా? ఎన్ఎస్​జీ కమాండోలు.. బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు తెరిచి వైసీపీ శ్రేణులు విరిసిన రాళ్లు తగలకుండా.. చంద్రబాబుకు అడ్డుపెట్టారు. అంటే ఇక్కడ బాధితుడు చంద్రబాబే కదా.! కానీ వైసీపీ రాజ్యాంగం ప్రకారం మన పోలీసులు నేరం చేసిన వైసీపీ శ్రేణుల్ని.. వదిలేశారు. రివర్స్‌లో చంద్రబాబుపై కేసుపెట్టారు.

ఓటమి భయంతోనే తప్పుడు కేసులు.. చూస్తూ ఊరుకోం : చంద్రబాబు

పోలీసులు చాలా సంయమనం పాటించారని చిత్తూరు ఎస్పీ రిశాంత్‌రెడ్డి అన్నారు. ఖాకీదుస్తుల్లో ఉన్న వ్యక్తి టీడీపీ శ్రేణులపైకి ఎలా రాళ్లు రువ్వుతున్నా.. ఈయన మాత్రం ఖాకీ చొక్కా వేసుకొచ్చిన వైసీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారు. ఐనా.. తెలుగుదేశం నేతలపై దాడుల విషయంలో పోలీసుల తీరు అంగళ్లులోనే కాదు.. గతంలో అనేక సందర్భాల్లోనూ ఇలాగే ఉంది. మాచర్ల ఘటనలో ఏకంగా పోలీస్‌ బాసే.. మీకక్కడ ఏంపని ఎదురు ప్రశ్నించారు. బాస్ బాటలోనే.. ఇప్పుడు రిశాంత్‌రెడ్డి కూడా.. మాట్లాడారు.

వైసీపీ నాయకుల దాడులు, దౌర్జన్యాలపై పోలీసులు.. మొదట‌్నుంచి పక్షపాతంతోనే వ్యవహరిస్తున్నారు. పైగా 'అధికార పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తే చేయించుకోండి! తిరిగి మీపైనే రివర్స్‌ కేసులు పెడితే పెట్టించుకోండి. అంతే తప్ప నోరెత్తొద్దు'అన్నట్లుగా.. రాష్ట్ర పోలీసులు ప్రవర్తిస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే.. ఆ పార్టీ నాయకులు టీడీపీ వారిపై దాడి చేస్తే తిరిగి.. బాధితులైన టీడీపీ నాయకులపైనే పోలీసులు హత్యాయత్నం కేసులు పెట్టారు.

TDP Leaders Fire on CM Jagan : 'షేమ్ ఆన్ యూ జగన్ రెడ్డీ..' చర్యకు ప్రతి చర్య తప్పదని టీడీపీ హెచ్చరిక

గతంలో.. చంద్రబాబు కుప్పం పర్యటనలోనూ టీడీపీ శ్రేణులపై వైసీపీవారు దాడి చేస్తే తిరిగి టీడీపీకు చెందిన వారిపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. మాచర్లలో.. తెదేపా కార్యాలయం తగలబెట్టి విధ్వంసం సృష్టిస్తే.. అక్కడా టీడీపీవారిపైనే హత్యాయత్నం కేసులు పెట్టారు. అమరావతి రైతుల దీక్షకు సంఘీభావం తెలిపి వస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ వాహన శ్రేణిపై వైసీపీ నాయకులు రాళ్లు విసిరితే వారిపైనా ఎలాంటి చర్యలూ లేవు. ఇలా చెప్పుకుంటూపోతే.. వైసీపీ పోలీస్‌జులుంకు లెక్కే లేదు.

రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా ఏపీ పోలీసింగ్‌.. వైసీపీ అనుబంధ విభాగంగా మారిందనేందుకు ఎన్నో రుజువులున్నాయి. పుంగనూరు, మాచర్ల, తంబళ్లపల్లె, కుప్పం వంటి నియోజకవర్గాల్లోనైతే.. పోలీసులు వైసీపీ కార్యకర్తల్ని మించి అరాచకాలు చేస్తున్నారని.. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డైతే.. ఆ ప్రాంతం తన జాగీరు అయినట్లు.. అక్కడ తాము తప్ప ప్రతిపక్షాలెవరూ అడుగే పెట్టకూడదన్నట్లుగా వ్యవహరిస్తారు. ఐనా.. ముఖ్యమంత్రి జగన్‌ ఏనాడూ పెదవి విప్పరు.

Chandrababu Reaction on Attempt to Murder Case: నాపైనే దాడి చేసి.. హత్యాయత్నం కేసా..?: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details