ఆంధ్రప్రదేశ్

andhra pradesh

SUICDE ATTEMPT: యువకుడు ఆత్మహత్యాయత్నం... చికిత్స పొందుతూ మృతి

By

Published : Jul 14, 2021, 4:22 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండలో విషాదం(tragedy) నెలకొంది. శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించుని.. ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. అతనికి వివాహమై వారం రోజులే అయిందని.. కుటుంబీకులు తెలిపారు.

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాహత్నం
పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాహత్నం

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణానికి చెందిన నవ వరుడు మహమ్మద్ గౌస్.. ఈ నెల 9న పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

చికిత్స పొందుతూ మహమ్మద్ గౌస్ మంగళవారం రాత్రి మృతి చెందాడు. మతిస్థిమితం సరిగా లేకపోవడంతో మహమ్మద్ గౌస్ బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. మరోవైపు.. అతనికి వివాహమై వారం రోజులే అయిందని.. కుటుంబీకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details