ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Student Protest in Anantapur Central University : అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో.. విద్యార్థుల ఆందోళన

By

Published : Nov 27, 2021, 10:49 PM IST

అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వీసీని బయటకు రానీయకుండా ముఖ ద్వారం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు.

అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ వద్ద విద్యార్థుల ఆందోళన
అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ వద్ద విద్యార్థుల ఆందోళన

అధిక ఫీజులు చెల్లిస్తున్నా.. మౌలిక వసతులు సరిగా కల్పించడం లేదంటూ అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వీసీ 'కోరి'ని బయటకు రానీయకుండా ముఖ ద్వారం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు.

వేలకు వేలు ఫీజులు కడుతున్నా శిథిలావస్థకు చేరిన వసతిగృహాన్ని ఇచ్చారని ఆరోపించారు. విద్యార్థినులు ఉన్న వసతి గృహంలో పెచ్చులూడి పడుతున్నాయని, ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గదులు సైతం అపరిశుభ్రంగా ఉన్నాయని, రుచికరమైన భోజన కూడా ఇవ్వట్లేదని వాపోయారు.

సెంట్రల్ యూనివర్సిటీకి ఉండాల్సిన రీతిలో మెరుగైన వసతులు ఒక్కటి కూడా లేవని వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తమ డిమాండ్ల కోసం నిరసన తెలుపుతుంటే.. యూనివర్సిటీ క్యాంపస్ లోకి పోలీసులు ఎందుకు వచ్చారని విద్యార్థులు ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

ప్రధాని మోదీకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ

ABOUT THE AUTHOR

...view details