ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పార్టీ బలపరిచిన అభ్యర్థి ఓడాడని కార్యకర్త ఆత్మహత్య

By

Published : Feb 16, 2021, 11:03 AM IST

తమ పార్టీ బలపరిచిన అభ్యర్థి పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడని ఓ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా శెట్టూరు మండలంలో జరిగింది.

ఆత్మహత్య చేసుకున్న నాగేంద్ర
ఆత్మహత్య చేసుకున్న నాగేంద్ర

తమ పార్టీ బలపరిచిన అభ్యర్థి పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయాడన్న బాధతో ఓ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడటం ఆ పార్టీ వర్గాలను కలిచివేసింది. అనంతపురం జిల్లా శెట్టూరు మండలం చర్లోపల్లి గ్రామానికి చెందిన నాగేంద్ర(52) ... తాజాగా జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఓటమి పాలయ్యాడని మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చంద్రబాబు నాయుడు, తెదేపాకి సంబంధించిన ఫొటోలు ఎదురుగా పెట్టుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నాగేంద్ర ఆత్మహత్య తీవ్రంగా కలిచి వేసిందని ఆ పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details