ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Mid Day Meals: ఆకలి తీర్చాల్సింది పోయి... ఆసుపత్రి పాలు చేస్తోంది..!

By

Published : Mar 18, 2022, 7:33 PM IST

Mid Day Meals: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆకలి తీర్చాల్సిన మధ్యాహ్న భోజనం కొన్నిసార్లు వారిని ఆసుపత్రి పాలుచేస్తోంది. నాణ్యమైన భోజనం అందించటంలో నిర్వహకులు విఫలమవుతున్నారన్న విమర్శలున్నాయి. విద్యా కమిటీల పర్యవేక్షణ లోపంతో కొన్ని చోట్ల కలుషిత భోజనం తింటున్న విద్యార్థులు అనేకచోట్ల ఆసుపత్రి పాలవుతున్న ఘటనలు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Mid Day Meals
ఆసుపత్రి పాలుచేస్తోన్న మధ్యాహ్న భోజన పథకం

Mid Day Meals: విద్యా కమిటీల పర్యవేక్షణ లోపంతో కొన్ని చోట్ల మధ్యాహ్న భోజనం విద్యార్థులను ఇబ్బంది పెడుతోంది. నాణ్యమైన భోజనం అందించటంలో నిర్వహకులు విఫలమవుతున్నారన్న విమర్శలున్నాయి. కలుషిత భోజనం తింటున్న విద్యార్థులు అనేకచోట్ల ఆసుపత్రి పాలవుతున్న ఘటనలు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఆసుపత్రి పాలుచేస్తోన్న మధ్యాహ్న భోజన పథకం

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆకలి తీర్చాల్సిన మధ్యాహ్న భోజనం.... కొన్నిసార్లు వారిని ఆసుపత్రి పాలుచేస్తోంది. ప్రభుత్వం ఇస్తున్న ఛార్జీలు సరిపోక, నాణ్యతలేని సరకులతో వంటలు చేస్తున్నారు భోజన నిర్వహకులు. మధ్యాహ్న భోజనంతో అనారోగ్యానికి గురైన విద్యార్థులు కోలుకోవడానికి ఎక్కువ రోజులు చికిత్స తీసుకోవల్సి వస్తోంది.

అనంతపురం జిల్లావ్యాప్తంగా మొత్తం 3 వేల 848 పాఠశాలలుండగా.... 3వేల 750 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 3లక్షల 76 వేల మంది ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు భోజనం చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. విద్యా కమిటీల పర్యవేక్షణ లోపించటంవల్లే... కలుషిత ఆహారం విద్యార్థులకు వడ్డిస్తున్నారని గతంలో కమిటీలో పనిచేసిన తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

మధ్యాహ్న భోజనానికి బియ్యం, కోడిగుడ్లు, వేరుసెనగ బర్ఫీలను గుత్తేదారుల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఇతర నిత్యావసరాలు, వంట గ్యాస్ లను సమకూర్చుకుని, వండి విద్యార్థులకు వడ్డించే బాధ్యత భోజన నిర్వహకులదే. ప్రాథమిక పాఠశాల విద్యార్థికి

4 రూపాయల 97పైసలు, ఉన్నత పాఠశాల విద్యార్థికి 7 రూపాయల 45 పైసల చొప్పున భోజన నిర్వహకులకు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ ఛార్జీలు సరిపోకనే కుళ్లిన కూరగాయలు వంటలో వినియోగిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. నిత్యం పర్యవేక్షిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.


మధ్యాహ్న భోజనంలో చోటుచేసుకుంటున్న ఇబ్బందులకు విద్యాశాఖ అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కలుషిత ఆహారంతో విద్యార్థుల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి:Heart Attack While Driving: ట్రాక్టర్​ డ్రైవర్​కు గుండెపోటు.. ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details