ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనంతపురం, కర్నూలులో కర్ణాటక మద్యం పట్టివేత

By

Published : Dec 13, 2020, 8:31 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో కర్ణాటక నుంచి తరలిస్తున్న అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2వేల 592 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను సీజ్ చేశారు. మద్యాన్ని తరలిస్తున్న ముగ్గురు నిందితులు పారిపోవటంతో.. వారికోసం గాలిస్తున్నట్లు ధర్మవరం పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. వారిపై కేసు నమోదు చేశారు.

karnataka liquor was seized in dharmavaram at ananthapur and kurnool district
అనంతపురం, కర్నూలులో కర్ణాటక మద్యం పట్టివేత

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో 2వేల 592 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని మహాత్మాగాంధీ కాలనీకి చెందిన నాగేంద్ర, కేశవ్, శంకర్ ముగ్గురు కలసి కర్ణాటక నుంచి మద్యం ప్యాకెట్లు తీసుకొచ్చి విక్రయించేందుకు పంచుకుంటుండగా పోలీసులు దాడి చేశారు. పోలీసులను చూసిన ముగ్గురు నిందితులు పరారయ్యారు. 27 పెట్టెలలో ఉన్న మద్యం టెట్రా ప్యాకెట్లను సీజ్ చేశారు. వాటి విలువ 90 వేల రూపాయలు ఉంటుందని ధర్మవరం పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. పారిపోయిన ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. వారిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.

కర్నూలులో..

కర్నూలు జిల్లా నందవరం మండలంలోని గంగవరం వద్ద పోలీసుల దాడుల్లో.. 672 కర్ణాటక మద్యం ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వినోద్ కుమార్, సీఐ మంజునాథ్ తెలిపారు. రవాణాకు వినియోగించిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.


ఇదీ చదవండి:

వీడియో: పాముకు గాయం.. ఆస్పత్రిలో చికిత్స

ABOUT THE AUTHOR

...view details