ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Student Suicide : రైలు కిందపడి విద్యార్థి ఆత్మహత్య...

By

Published : Oct 6, 2021, 2:06 PM IST

ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురంలో చోటుచేసుకుంది.

Student Suicide
రైలు కిందపడి విద్యార్థి ఆత్మహత్య...

అనంతపురం జేఎన్టీయూ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఉమేష్(22), రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సోమందేపల్లి గ్రామానికి చెందిన ఉమేష్ అనంతపురం పట్టణంలో గదిలో అద్దెకు ఉంటూ విద్యనభ్యసిస్తున్నాడు. అర్థరాత్రి సమయంలో తన గది నుంచి బయటకు వచ్చి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఉమేష్ అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు.

ఉమేష్ కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ విజయ్ తెలిపారు.

ఇదీ చదవండి : Aadhar Mistake: అధికారుల నిర్వాకం.. తలకిందులైన యువకుడి జీవితం

ABOUT THE AUTHOR

...view details