ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఐపీఎల్ బెట్టింగ్​ రాయుళ్లు అరెస్ట్​.. రూ. 55 వేలు స్వాధీనం

By

Published : May 1, 2021, 3:46 PM IST

అనంతపురం జిల్లాలో క్రికెట్​ బెట్టింగ్​కు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. రూ. 55 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.

cricket betting batch arrested
ఐపీఎల్ బెట్టింగ్​ రాయుళ్ల అరెస్ట్

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడిన ఐదుగురిని అనంతపురం జిల్లా కదిరి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని జౌకుపాళ్లెం వీధి, కంచుకోట ప్రాంతాలకు చెందిన రామ్మోహన్, ఆంజనేయులు, ఆదిల్, ఇర్ఫాన్, ఆరిఫ్ అనే నిందితులు మెుబైల్​ ఫోన్లను వినియోగించి బెట్టింగ్​ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా దాడి చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని 2 చరవాణులు, రూ. 55 వేలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details