పలు జిల్లాల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
అనంతపురం జిల్లాలో..
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం మావటూరు గ్రామం వద్ద పోలీసులు.. అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. కర్ణాటక నుండి ఎవరికీ అనుమానం రాకుండా సెప్టిక్ ట్యాంక్ వాహనంలో తరలిస్తున్న 1392 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని..ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మద్యం విలువ రూ.3 లక్షల ఉంటుందన్నారు.
ప్రకాశం జిల్లాలో..
ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో నాటు సారా తయారీకి సిద్ధంగా ఉన్న 2400 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. నాటు సారా తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గుంటూరు జిల్లాలో..
గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలో ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. నాటు సారా తయారీకి సిద్ధంగా ఉన్న 840 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. తిప్పర్తి నుంచి రొంపిచర్లకు పాల వ్యానులో అక్రమంగా తరలిస్తున్న 1,438 మద్యం సీసాలను దాచేపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన మద్యం రూ.2.10 లక్షలు విలువ చేస్తుందన్నారు.
ఇదీ చదవండి