ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైసీపీ కార్యాలయ భవన నిర్మాణ పనుల అడ్డగింత..

By

Published : Jan 4, 2023, 12:51 PM IST

Locals are blocking the construction work: అనకాపల్లి జిల్లా కేంద్రంలో వైసీపీ జిల్లా కార్యాలయ నిర్మాణ పనులను స్థానికులు అడ్డుకున్నారు. గ్రామ అవసరాలకు స్థలాన్ని కేటాయించకుండా రాజకీయ పార్టీ భవనానికి స్థలాన్ని కేటాయించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ పనుల్లో భాగంగా స్థలాన్ని చదును చేయడానికి వచ్చిన ప్రోక్లయిన్ నిఅడ్డుకొని స్థలాన్ని గ్రామ అవసరానికి ఉంచాలంటు నినాదాలు చేశారు.

Locals are blocking the construction work
గ్రామ అవసరాల స్థలాన్ని... వైసీపీ భవనానికి కేటాయించడంపై స్థానికులు ఆగ్రహం

Locals are blocking the construction work: అనకాపల్లి మండలం కొత్తూరు నరసింగరావుపేటలో వైసీపీ జిల్లా కార్యాలయ పనులను స్థానికులు అడ్డుకున్నారు. జాతీయ రహదారి పక్కనే ఎకరా 75 సెంట్ల స్థలాన్ని... ఏడాదికి వెయ్యి అద్దె చొప్పున అధికారులు.... వైసీపీ కార్యాలయం భవనం కోసం కేటాయించారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ అవసరాలకు స్థలాన్ని కేటాయించకుండా రాజకీయ పార్టీ భవనానికి ఎలా ఇస్తారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ పనుల కోసం స్థలాన్ని చదును చేసేందుకు వచ్చిన ప్రొక్లెయిన్‌ను అడ్డుకొన్నారు. పనులు చేయడానికి వీల్లేదంటూ మహిళలు నినాదాలు చేశారు. అధికారులు ఆలోచనను విరమించుకోకుంటే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

గ్రామ అవసరాల స్థలాన్ని... వైసీపీ భవనానికి కేటాయించడంపై స్థానికులు ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details