ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జంట.. మళ్లీ ఒక్కటయ్యెనంట!

By

Published : Jun 2, 2022, 11:06 AM IST

Supreme Court judges: పెళ్లి.. జీవితంలో ఒక్కసారే వచ్చే అపురూమైన సందర్భం. అయితే.. కొన్నేళ్ల కాపురం తర్వాత.. మళ్లీ అదే జంట తిరిగి పెళ్లి పీటలు ఎక్కితే ఎలా ఉంటుంది? మళ్లీ ఆ జంట తమ జీవితాలను ముడి వేసుకుంటే ఎలా అనిపిస్తుంది? తప్పకుండా సరికొత్త తీపి గుర్తుగా మిగిలిపోతుంది! ఇలా రెండోసారి ఒక్కటికావాలని కోరుకునే వారి పెళ్లి.. మేం చేస్తామంటున్నారు అరకులోయ మండలంలోని 'గిరిగ్రామ దర్శిని' నిర్వాహకులు. ఇప్పటి వరకూ చాలా మంది ఇలా మరోసారి పెళ్లి చేసుకున్నారు. తాజాగా.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ దంపతులు పెళ్లి పీటలెక్కారు.

Supreme Court judges
సీతారామరాజు జిల్లాలో న్యాయమూర్తులు

Supreme Court judges: గిరిజన సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవడం తనకు ఎంతో మధురానుభూతిని కలిగించిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యూయూ లలిత్‌ అన్నారు. అరకులోయ అందాలను చూసేందుకు బుధవారం జస్టిస్‌ లలిత్‌ సతీసమేతంగా ఇక్కడకు వచ్చారు. విశాఖపట్నం నుంచి కిరండూల్‌ ప్యాసింజర్‌లో వచ్చిన న్యాయమూర్తి లలిత్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా హైకోర్టు న్యాయమూర్తి అమానుల్లాఖాన్‌లకు.. అరకు రైల్వేస్టేషన్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయం ప్రకారం వివాహాలు నిర్వహించే గిరి గ్రామదర్శినిని వారు సందర్శించారు. ఇక్కడ జస్టిస్‌ లలిత్‌ దంపతులు వధూవరులుగా మారారు. జస్టిస్‌ లలిత్‌ ఆయన సతీమణి అమిత ఉదయ్‌ లలిత్‌ గిరిజన సంప్రదాయంలో మరోసారి వివాహం చేసుకున్నారు. పెదలబుడు సర్పంచి పెట్టెలి దాసుబాబు పెళ్లి పెద్దగా వ్యవహరించారు. న్యాయమూర్తి దంపతులు వేడుకను ఆద్యంతం ఆస్వాదించారు. అంతకుముందు జడ్జీలు టాయ్‌ ట్రైన్‌లో కూర్చొని పద్మాపురం ఉద్యానం తిలకించారు. గిరిజన మ్యూజియాన్ని సందర్శించారు. తిరిగి కిరండూల్‌ ప్యాసింజర్‌లో విశాఖ వెళ్లారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు.

సీతారామరాజు జిల్లాలో న్యాయమూర్తులు

అతిథి మర్యాదలు బాగున్నాయని, గిరిజన వివాహం చేసుకోవడం మదురానుభూతిని మిగిల్చిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ అన్నారు. జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని తీపి గుర్తుగా ఉంటుందని గిరి గ్రామదర్శిని ప్రజలకు, జిల్లా కలెక్టర్​కు, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details