ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Cheating: రూ.3 కోట్లతో వాలంటీరు పరారీ.. లబోదిబోమంటున్న బాధితులు

By

Published : Feb 19, 2022, 9:08 AM IST

volunteer escapes with rs 3 crores: విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని వాలంటీరు ఘరానా మోసం బయటపడింది. పొదుపు, చీటీల పేరుతో రూ.3 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడింది. పది రోజులుగా ఇంటికి తాళం వేసి ఉండటంతో అనుమానం వచ్చిన బాధితులు శుక్రవారం రోజు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

volunteer escapes with rs 3-crores
volunteer escapes with rs 3-crores

volunteer escapes with rs 3-crores: పొదుపు, చీటీల పేరుతో విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని చిట్లువీధికి చెందిన వార్డు వాలంటీరు మానాపురం రమ్య రూ.3 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడింది. పది రోజులుగా ఇంటికి తాళం వేసి ఉండటంతో అనుమానం వచ్చిన బాధితులు శుక్రవారం సాలూరు పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

15 ఏళ్లుగా రమ్య, ఆమె తల్లి అరుణ పొదుపు పేరుతో వ్యాపారం సాగిస్తున్నారు. కొంత సొమ్ము చెల్లిస్తే ఎక్కువ వడ్డీ ఇస్తామనడంతో చిరు వ్యాపారులు, రోజు కూలీలు, మురికివాడల్లోని మహిళలు వారి వద్ద పొదుపు కట్టారు.

రోజు, వారం, నెల ప్రాతిపదికన సుమారు 2వేల మంది దగ్గర డబ్బులు వసూలు చేశారు. రోజుకు రూ.పది నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారు. రూ.10 కట్టినవారికి రూ.4వేలు, రూ.200 కట్టిన వారికి రూ.80వేలు ఏడాదికి వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది డిసెంబరు నెలతో ఏడాది గడువు పూర్తయిన సుమారు 150 మందికి ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదు. అడిగితే బ్యాంకులో పెద్ద మొత్తంలో సొమ్ము ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. పది రోజుల క్రితం పెళ్లికి వెళ్తున్నాం అని చెప్పి తిరిగి రాకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు బోరుమంటున్నారు.

ఇదీ చదవండి:

Cruel Son: ఆస్తి కోసం కొడుకు కర్కశత్వం..తల్లిని కర్రతో కొడుతూ.. కాలితో తన్నుతూ

ABOUT THE AUTHOR

...view details