ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Bus Accident: ఆర్టీసీ బస్సు బోల్తా.. బస్సులో 32 మంది..?

By

Published : Aug 17, 2021, 4:31 AM IST

కర్నూలు నుంచి హైదరాబాద్​కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​ చౌరస్తా సమీపంలో డివైడర్​ ఢీకొట్టటంతో బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. మరో ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ఆస్పత్రికి తరలించారు.

bus accident
bus accident

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​ చౌరస్తా వల్ల ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అలంపూర్ చౌరస్తా సమీపంలో ఘర్ దాబా వద్ద డివైడర్​ను ఢీకొట్టడంతో బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 32 మంది ఉండగా.. నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

డివైడర్​ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. నలుగురికి తీవ్రగాయాలు

బస్సు బలంగా డివైడర్​ను ఢీకొట్టడం వల్ల బస్సు రాడ్డు విరిగి వెనక వస్తున్న కారులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో కారులో వెంటనే ఎయిర్ బెలూన్​లు తెరుచుకోవటం వల్ల.. అందులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణ హాని జరగకవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, హైవే సిబ్బంది.. రహదారిపై రాకపోకలను పునరుద్ధరించారు. మిగిలిన ప్రయాణికులను వేరువేరు వాహనాల్లో వారి వారి గమ్యస్థానాలకు పంపించారు.

ABOUT THE AUTHOR

...view details