ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పట్టాలు దాటుతుండగా.. ఎంఎంటీఎస్​ రైలు ఢీకొని ముగ్గురు మృతి

By

Published : Jul 26, 2022, 6:09 PM IST

MMTS train hit - Three dead: హైదరాబాద్​లో ఘోర ప్రమాదం జరిగింది. హైటెక్​ సిటీ సమీపంలో పట్టాలు దాటుతుండగా ఎంఎంటీఎస్​ రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒకరి దగ్గర మద్యం సీసాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

1
1

Train Accident: హైదరాబాద్​లోని హైటెక్‌ సిటీ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎంఎంటీఎస్‌ రైలు ఢీకొని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హైటెక్‌ సిటీ రైల్వే స్టేషన్‌ సమీపంలోని మూల మలుపు వద్ద ఎంఎంటీఎస్‌ రైలును గమనించకుండా.. పట్టాలు దాటేందుకు ప్రయత్నించిన రాజప్ప, శ్రీను, కృష్ణను రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకరి వద్ద మద్యం సీసాలు ఉన్నట్టు గుర్తించారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులు వనపర్తి వాసులుగా గుర్తించామని, వీరంతా సంకల్ప్‌ అపార్ట్‌మెంట్‌ సమీపంలో నివసిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.

ఇవీ చూడండి:

TAGGED:

c

ABOUT THE AUTHOR

...view details