ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Teachers misbehave with Student: కీచక ఉపాధ్యాయులు.. బాలికలతో అసభ్య ప్రవర్తన

By

Published : Feb 17, 2022, 8:21 AM IST

Sexual Harassment: కొండలపై బతికే గిరిజనులు తమ పిల్లలు ఉన్నతంగా చదువుకోవాలని పాఠశాలలకు పంపిస్తే.. ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రం కీచకులుగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థినులను తాకుతూ, అసభ్యకర ఫొటోలు తీశారు. ఆగడాలను భరించలేకపోయిన బాలికలు, తల్లిదండ్రులు కలిసి ఉపాధ్యాయుల దుశ్చర్యలు ప్రస్తావిస్తూ తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో విషయం వెలుగుచూసింది.

Teacher misbehave with Student
Teacher misbehave with Student

Teachers Sexual Harassment: విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని బాలేసు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థినులను తాకుతూ, అసభ్యకర ఫొటోలు తీస్తున్నట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ పాఠశాలలో 92 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ నలుగురు ఉపాధ్యాయులు ఉండగా ప్రధానోపాధ్యాయుడు స్వామినాయుడు, ఉపాధ్యాయుడు సూర్యనారాయణపై బాలికలు ఆరోపణలు చేస్తున్నారు. ఒంటరిగా ఉన్న సమయాల్లో శరీరాన్ని తాకుతున్నారని, ముద్దులు పెడుతున్నారని, కురచ దుస్తుల్లో వెళ్తే ఫొటోలు తీస్తున్నారని వాపోతున్నారు.

యోగా తరగతుల పేరిట పైన చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. తల్లిదండ్రులకు చెప్పొద్దని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండు చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. గ్రామాన్ని సందర్శించి గ్రామస్థులు, పాఠశాల కమిటీ సభ్యులతో ఆమె విడివిడిగా మాట్లాడారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను, వాలంటీరును తొలగించాలని ఎంపీడీవోను ఆదేశించారు. చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన వారిపైనా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:మామతో వివాహేతర సంబంధం.. ఏకాంతంగా ఉన్నప్పుడు కుమార్తె చూసిందని..

ABOUT THE AUTHOR

...view details