ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇంట్లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. ఒకరి మృతి, 10 మందికి గాయాలు

By

Published : Oct 26, 2022, 1:25 PM IST

Gas Cylinder Blast in Hyderabad: ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఓ వ్యక్తి మృతి చెందగా.. 10 మంది గాయపడిన ఘటన సికింద్రాబాద్‌లో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Gas Cylinder Blast
గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు

Gas Cylinder Blast in Hyderabad: సికింద్రాబాద్‌లోని చిలకలగూడ దూద్‌ బావి వద్ద గల ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో నారాయణ స్వామి అనే వ్యక్తి మృతి చెందాడు. ఉదయం సమయంలో ఒక్కసారిగా భారీ శబ్ధంతో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇంట్లో ఉన్న వారితో పాటు చుట్టుపక్కల ఉన్న 10 మందికి గాయాలయ్యాయి. ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పేలుడు ధాటికి చుట్టు పక్కల ఉన్న ఇళ్ల గోడలూ పగుళ్లు వచ్చాయని అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details