ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రేమకథ విషాదాంతం.. ప్రేయసి మరణం తట్టుకోలేక ప్రియుడు మృతి

By

Published : Sep 8, 2022, 12:48 PM IST

Lovers suicide తల్లి లేని ఆ యువకుడిని ప్రేయసే తల్లిలా ఆదరించింది. తండ్రి లేని ఆ యువతిని ప్రియుడే తండ్రిలా చూసుకున్నాడు. వ్యక్తిగత జీవితాల్లో నెలకొన్న వెలితిని ప్రేమబంధంతో పూడ్చుకోవాలని భావించారు. ఇద్దరం ఒకటవుదామని.. యువతిని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంతలోనే యువకుడి తండ్రి అడ్డుచెప్పగా.. మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రేయసి మరణం తట్టుకోలేక యువకుడు సైతం బలవన్మరణం చెందాడు.

Lovers suicide
Lovers suicide

Lovers suicide తల్లి లేని యువకుడు.. తండ్రిలేని ఆ యువతి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరి వ్యక్తిగత జీవితాల్లో నెలకొన్న వెలితి.. ప్రేమ బంధంతో ఒక్కటవుదామని అనుకున్నారు. వాళ్ల ప్రేమకు యువకుని తండ్రి అడ్డు చెప్పగా మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆ బాధలోనే యువకుడు వారం రోజుల వ్యవధిలోనే బలవన్మరణం చెందాడు. ఈ హృదయ విషాదక ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.

ఆశ్వాపురంలోని కాలా బజారుకు చెందిన సాయి, మణుగూరు మండలానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. ప్రేమించిన యువతిని ఇంటికి తీసుకురాగా అతని తండ్రి ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన యువతి... వారం రోజుల కిందట పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి సాయి తీవ్ర మనస్తాపానికి గురై బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలం పనులకు వెళ్లిన తండ్రి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి సాయి విగతజీవిగా కనిపించాడు. తల్లి నాలుగేళ్ల కిందట పాముకాటుతో మృతి చెందగా తర్వాత తండ్రి రెండో పెళ్లి చేసుకున్నారు. యువతి తండ్రి ఎనిమిది ఏళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందగా తల్లి ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతోందని దగ్గరి బంధువులు చెప్పారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details