ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తండ్రిని, బాబాయిని చంపేశాడు..

By

Published : Aug 12, 2022, 12:57 PM IST

LAND DISPUTES: ఓ వ్యక్తి కన్నతండ్రిని, బాబాయిని హత్య చేశాడు. తెలంగాణలో ఈ దారుణం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

MURDER
MURDER

SON KILLED FATHER: నిజామాబాద్ జిల్లా మోపాల్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి.. తన తండ్రిని, బాబాయిని పారతో కొట్టి హత్యచేశాడు. కర్రోళ్ల అబ్బయ్య, అతని సోదరుడు సాయిలుతో.. అబ్బయ్య కుమారుడు సతీష్‌కు భూమి విషయమై కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం రాత్రి గొడవ పెరిగింది. దీంతో.. విచక్షణ కోల్పోయిన సతీష్.. తండ్రి అబ్బయ్య, బాబాయి సాయిలును పారతో తలపై మోదాడు.

దెబ్బలు తీవ్రంగా తగలడంతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు ప్రధాన కారణం భూ తగాదాలేనని స్థానికులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details