ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Gold Seized: లో దుస్తుల్లో బంగారం అక్రమ రవాణా.. ఎయిర్​పోర్టులో ముగ్గురు అరెస్ట్

By

Published : Oct 5, 2021, 9:05 PM IST

బంగారం స్మగ్లర్లు వినూత్న పద్ధతులు పాటిస్తున్నారు. విదేశాల నుంచి హైదరాబాద్​కు ఎన్ని రకాలుగా పుత్తడిని తీసుకురావొచ్చో.. వారి మేథస్సుకు పని చెప్తున్నారు. ఎన్ని చావు తెలివితేటలు వాడినా.. శంషాబాద్​ కస్టమ్స్(Gold Seized at shamshabad airport news)​ అధికారులు ఇట్టే పసిగట్టేస్తున్నారు. తాజాగా.. ఓ విదేశీయురాలు బంగారాన్ని ఎలా తీసుకొచ్చిందంటే..?

Gold Seized
Gold Seized

Gold Seized: లో దుస్తుల్లో బంగారం అక్రమ రవాణా.. ఎయిర్​పోర్టులో ముగ్గురు అరెస్ట్

విదేశాల నుంచి హైదరాబాద్​కు బంగారం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. కస్టమ్స్​ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. అక్రమార్కులు మాత్రం స్మగ్లింగ్​ ఆపట్లేదు. కాకపోతే.. తరలించే పద్ధతిని మాత్రం మారుస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్తగా స్మగ్లింగ్​ చేస్తూనే ఉన్నారు. ఇలా కూడా బంగారాన్ని తరలించొచ్చా..? అనే ఆశ్చర్యం కలిగేలా అక్రమ రవాణా సాగుతోంది. అక్రమార్కులు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా.. అధికారులు వారిని పట్టుకుని.. వారి ప్రణాళికలను పటాపంచలు చేస్తూనే ఉన్నారు. లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు.

హైదరాబాద్​లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు కిలోకు పైగా అక్రమ బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు(Gold Seized at shamshabad airport news). సూడాన్‌ నుంచి దుబాయ్‌ మీదుగా హైదారాబాద్‌ వచ్చిన విదేశీయురాలిపై కస్టమ్స్‌ అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మూటాముల్లెతో పాటు చేతి సంచిని కూడా పోలీసులు తనిఖీ చేశారు. ఇంకొంచెం లోతుగా తనిఖీ చేయగా.. దాచిన పుత్తడి బయటపడింది.

గోళాకారంలో ఉన్న నల్లటి ఉండలను లోదుస్తులు, చేతి సంచిలో గుర్తించారు. ఆ ఉండలను చీల్చి చూడగా అందులో దాచిన బంగారం బయటపడింది. ఈ ఉండల రూపంలో మొత్తంగా రూ.58.16 లక్షల విలువైన 1209 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు విదేశీయురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు కస్టమ్స్‌ డిప్యూటీ కమిషనర్‌ బాలసుబ్రమణ్యం వివరించారు.

అక్రమార్కులు ఎన్ని రకాలుగా.. ఇంకెన్నో కొత్త పద్ధతుల్లో బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించినా... పోలీసులు కనిపెట్టేస్తున్నారు. స్మగ్లింగ్​ చేస్తున్నవారిని పసిగట్టి.. బంగారం ఎక్కడ దాచినా బయటకు తీస్తున్నారు. ఎన్ని రకాలుగా స్మగ్లింగ్​కు ప్రయత్నించినా... ఇట్టే పట్టుకుని కటకటపాలు చేస్తామని అక్రమార్కులను కస్టమ్స్​ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇవీ చూడండి:

Badwel By-Poll: కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పేరు ఖరారు

ABOUT THE AUTHOR

...view details