ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రభుత్వ పరిశ్రమల ప్రైవేటీకరణకు వైకాపా వ్యతిరేకం: విజయసాయిరెడ్డి

By

Published : Apr 16, 2021, 5:52 PM IST

బంగాల్‌ ఎన్నికల తర్వాత స్టీల్‌ప్లాంట్‌పై ప్రధానితో పూర్తిస్థాయిలో చర్చిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ప్రభుత్వ పరిశ్రమల ప్రైవేటీకరణకు వైకాపా వ్యతిరేకమని స్పష్టం చేశారు.

ycp mp vijaya sai reddy
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ

ప్రభుత్వ పరిశ్రమల ప్రైవేటీకరణకు వైకాపా వ్యతిరేకమని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ప్రగతి భారత్ ఫౌండేషన్, వైకాపా ఆధ్వర్యంలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 23, 24న విశాఖలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు చెప్పారు. జాబ్‌ మేళా ద్వారా దాదాపు 4 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వివరించారు. ఇందులో 75 శాతం ఉద్యోగాలు మహిళలకు ఇచ్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.

బంగాల్‌ ఎన్నికల తర్వాత స్టీల్‌ప్లాంట్‌పై ప్రధానితో పూర్తిస్థాయిలో చర్చిస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఉక్కు కార్మికులను కేంద్రమంత్రుల వద్దకు తీసుకెళ్లి చర్చలు జరుపుతామన్నారు. ప్రైవేటీకరణకు వైకాపా వ్యతిరేకమని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details