ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రభుత్వంతో మాట్లాడి పదోన్నతులు కల్పించే బాధ్యత నేను తీసుకుంటా

By

Published : Oct 8, 2022, 7:12 PM IST

Swarupanandendra Swami: అంతర్గత కలహాలతో దేవాదాయ శాఖను భ్రష్టుపట్టిస్తున్నారని స్వరూపానందేంద్ర స్వామి మండిపడ్డారు. దేవదాయశాఖలో రెవెన్యూ ఉద్యోగుల సేవలు అవసరమేనని ఆయన తెలిపారు. కోర్టు వ్యాజ్యాలను పక్కనపెట్టి ఉద్యోగులంతా ఏకతాటిపైకి రావాలన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి పదోన్నతులు కల్పించే బాధ్యతను ఆయన తీసుకుంటానన్నారు.

Swarupanandendra Swami
స్వరూపానందేంద్ర స్వామి

Swarupanandendra Swami: దేవాదాయ శాఖ తీరుపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి మండిపడ్డారు. అంతర్గత కలహాలతో అధికారులు... దేవాదాయ శాఖను భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత ప్రాబల్యం కోసం పాకులాడుతున్నారన్నారు. పెరుగుతున్న భూవివాదాలు, భూ కబ్జాల దృష్ట్యా దేవాదాయశాఖలో రెవెన్యూ ఉద్యోగుల సేవలు అవసరమే అని తెలిపారు. అలాగని దేవాదాయశాఖ ఉద్యోగస్తులను నిర్వీర్యం చేస్తే ఊరుకునేదని తేల్చి చెప్పారు. దేవాదాయ శాఖలో అధికారుల సంఖ్య తక్కువగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 12 ఏళ్లుగా దేవాదాయ శాఖలో ప్రమోషన్లకు నోచుకోకపోవడం శోచనీయమన్నారు. కోర్టు వ్యాజ్యాలను పక్కనపెట్టి ఉద్యోగులంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. అలా వస్తే ప్రభుత్వంతో మాట్లాడి పదోన్నతులు కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.

సింహాచలంలో దేవాదాయ శాఖ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి హాజరయ్యారు. దేవాదాయశాఖలో పదోన్నతులు ఇవ్వడం లేదని, రెవిన్యూ ఉద్యోగులను దేవదాయశాఖలో నియమించకూడదని ఈ సమావేశం నిర్వహించారు.

"ఆగమ శాస్త్రాలు తెలియని రెవెన్యూ ఉద్యోగులు దేవాదాయ శాఖను ఆక్రమించుకుంటున్నారు. దేవాదాయశాఖ ఉద్యోగాలు... రెవెన్యూవాళ్లు కొట్టేస్తున్నారు. దేవాదాయ శాఖలో రెవెన్యూవాళ్లు రాకూడదని 15ఏళ్లుగా శారదా పీఠం పోరాటం చేస్తోంది. ఏ ప్రభుత్వం చేసినా నేను ఖండిస్తాను. ఉద్యోగులకు అండగా ఉంటాను. దేవాదాయశాఖలో భర్తీ చేయకుండా ఆర్జేసీలు, డీసీలు, ఏసీ పోస్టులు ఉన్నాయి. వాటన్నింటిలో దేవాదాయశాఖ ఉద్యోగులే ఉండాలి. దేవాదాయశాఖ ఉద్యోగులు కూడా ఆధిపత్య పోరుతోనూ, ఒకరంటే ఒకరుకి గిట్టక కోర్టులుకు వెళ్లి కేసులు వేసుకుంటుందటంతో పదోన్నతులు రావడంలేదు. కేసులు విరమించుకోవాలి." -విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details