ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'హిందువుల మనోభావాలు దెబ్బతీసే కుట్రలను నిరోధించాలి'

By

Published : Jan 2, 2021, 7:17 PM IST

హిందువుల మనోభావాలను దెబ్బతీసే కుట్రలను నిరోధించాల్సిన అవసరముందని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. మంత్రి వెల్లంపల్లితో ఫోన్​లో మాట్లాడిన ఆయన.. పలు అంశాలపై సూచనలు చేశారు.

swaroopananda swamy
swaroopananda swamy

ఆలయాలపై దాడులను విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్రంగా ఖండించారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లితో ఫోన్లో మాట్లాడిన ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే కుట్రలను నిరోధించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.

ఆలయాల భద్రత విషయంలో కింది స్థాయి ఉద్యోగులను సైతం అప్రమత్తం చేయాలని దిశానిర్దేశం చేశారు. దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందనే సంకేతాలు భక్తులకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని స్వరూపానందేంద్ర చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details