ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తల్లిని చంపిన తనయుడు.. కేసు ఛేదించిన పోలీసులు

By

Published : Nov 7, 2021, 4:05 PM IST

ఆస్థి కోసం కన్న తల్లిని కుమారుడు హతమార్చిన ఘటన విశాఖ నగరంలో చోటుచేసుకుంది. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు అసలు వాస్తవాలను ఛేదించారు.

తల్లిని చంపిన తనయుడు
తల్లిని చంపిన తనయుడు

విశాఖ నగరంలోని పూర్ణామార్కెట్‌లో వృద్ధురాలి హత్య కేసుని పోలీసులు(old women was murdered by son in vizag case chased by police) ఛేదించారు. మృతురాలి చిన్న కుమారుడు నాగశంకర్ నిందితుడని డీసీపీ గౌతం సాలి తెలిపారు. ఇంటి పత్రాలు, బంగారం ఇవ్వాలని తల్లిని కోరగా.. ఆమె నిరాకరించడంతో మెడకు నైలాన్ తాడు చుట్టి హతమార్చినట్లు తెలిపారు.

అసలేం జరిగిందంటే..

వృద్ధురాలిని బంగారం, డబ్బు కోసం దారుణంగా హత్య చేశారు. పూర్ణామార్కెట్ దుర్గాలమ్మ గుడి సమీపంలోని పిరికి వీధిలో ఒంటరిగా నివాసం ఉంటున్న నల్లి అచ్చియ్యమ్మ అనే వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. వృద్ధురాలు ఒంటరిగా ఉండటాన్ని గమనించిన దుండగులు ఇంట్లోకి చొరబడి మెడకు తాడు బిగించి హత్య చేసి బంగారం, నగదు దోపిడీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వన్ టౌన్ పోలీసులు క్లూస్ టీం సాయంతో కేసును ఛేదించారు.

ఇదీ చదవండి:రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. నలుగురి పరి‌స్థితి విషమం

ABOUT THE AUTHOR

...view details