ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖలో డ్రగ్స్‌ కలకలం..53 గ్రాముల మాదకద్రవ్యాలు స్వాధీనం

By

Published : Apr 13, 2022, 12:12 PM IST

Updated : Apr 14, 2022, 10:06 AM IST

Drugs at visakha
విశాఖలో డ్రగ్స్‌ కలకలం

12:07 April 13

పోలీసుల అదుపులో ముగ్గురు

Drugs: విశాఖలో డ్రగ్స్ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంజనీరింగ్, మేనేజ్​మెంట్ చదువుతున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..53 గ్రాముల ఎండిఎంఎ పౌడర్​ను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా డ్రగ్స్​ దందా మూలాలను అన్వేషించే పనిలో పడ్డారు.

విశాఖ చినవాల్తేర్​లోని ఒక అపార్ట్​మెంట్​పై పోలీసుల దాడి చేయడంతో ఈ డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. చినవాల్తేర్​కు చెందిన కె. అవినాష్,.. మురళీనగర్​కి చెందిన ఎ.శ్రీవాత్సవ్, సీతమ్మధారకు చెందిన వి. అవినాష్ నాయుడు ముగ్గురూ స్నేహితులు. అనినాష్​ బెంగళూరుకు చెందిన తరుణ్, శ్రీకర్​ల వద్దకు వెళ్లి 53గ్రాముల ఎండిఎంఎ పౌడర్​ను గ్రాము రెండు వేల రూపాయలకు కొనుగోలు చేసి విశాఖ తీసుకువచ్చారు. గతంలోను ఇలాగే తెచ్చి అమ్మడంతో.. పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది. ఈసారి కూడా అదే మాదిరిగా చేయాలని భావించారు.

గ్రాము చొప్పున 53 పొట్లాలుగా సిద్దం చేసి వాటిని గ్రాము ఐదు వేల రూపాయలకు విక్రయానికి నిర్ణయించుకున్నారు. ఈ సమాచారం అందుకున్నపోలీసులు అపార్ట్​మెంట్​పై దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. మూడో పట్టణ పోలీసులు, టాస్క్​ఫోర్స్ పోలీసులు ఈ దాడిలో పాల్గొన్నారు. ఈ డ్రగ్స్​ వ్యవహారంతో బెంగళూరుకు సంబంధం ఉండటంతో అక్కడి పోలీసులకు సమాచారమిచ్చి.. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: గుత్తేదారుకే కానుక.. గతేడాది కంటే రూ.92 కోట్లు అదనం

Last Updated : Apr 14, 2022, 10:06 AM IST

ABOUT THE AUTHOR

...view details