ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖలో విక్రయించి... ఉత్తరప్రదేశ్​లో కొత్తది స్థాపిస్తారా..?

By

Published : Feb 5, 2021, 9:32 PM IST

లక్ష కోట్ల రూపాయల విలువైన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపకపోతే ఉద్యమాలు చేస్తామని... కేంద్ర మాజీమంత్రి చింతామోహన్‌ హెచ్చరించారు. విశాఖ ఉక్కు ప్యాక్టరీని విక్రయించి ఉత్తరప్రదేశ్​లో మరో ఉక్కు పరిశ్రమ ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

Chinta Mohan Warns Union Government Over Vizag Steel Plant Issue
కేంద్ర మాజీమంత్రి చింతామోహన్‌

కేంద్ర మాజీమంత్రి చింతామోహన్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రుల హక్కుగా ఉన్న విశాఖ ఉక్కు... ఇప్పుడు ప్రైవేటు హక్కుగా మారుతోందని కేంద్ర మాజీమంత్రి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చింతా మోహన్‌ ఆరోపించారు. 32 మంది ప్రాణత్యాగాలతో, ఆరు నెలల పాటు సాగిన ఉద్యమంతో సాకారమైన విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలని.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందికాదని ఆయన వ్యాఖ్యానించారు.

1966లో ఉక్కు సత్యాగ్రహం మొదలై దాదాపు ఆరు నెలలపాటు సాగిందని వివరించారు. దాదాపు 33 వేల ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభమై... 17,500 మందికి ఉపాధి కల్పిస్తోందని వివరించారు. లక్ష కోట్ల రూపాయల విలువైన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపకపోతే ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఓ వైపు రైతుల ఉద్యమాన్ని అణచివేస్తూ... మరోవైపు ఉక్కు ప్యాక్టరీని విక్రయించి ఉత్తరప్రదేశ్​లో మరో ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఇదీ చదవండీ... 'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. అమృతరావు ఆశయానికి తూట్లు పొడవడమే'

ABOUT THE AUTHOR

...view details