ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ACB RIDE: రెవెన్యూ కార్యాలయాలపై రెండో రోజూ అనిశా తనిఖీలు

By

Published : Jul 21, 2021, 7:51 PM IST

విజయనగరం, విశాఖ జిల్లాల్లో రెండో రోజూ పలు తహసీల్దార్ కార్యాలయాల్లో అనిశా సోదాలు నిర్వహించింది. మ్యుటేషన్లు, భూ లావాదేవీలతోపాటు.. కుల ధ్రువీకరణ పత్రాల జారీలో లోపాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఎలాంటి కారణం లేకుండా మీ సేవా దరఖాస్తులను తిరస్కరించినట్లు సోదాల్లో వెలుగులోకి వచ్చింది.

acb rides
అనిశా తనిఖీలు

విశాఖ, విజయనగరం జిల్లాల్లోని 12 తహసీల్దార్ కార్యాలయాల్లో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. విశాఖ జిల్లాలోని సీతమ్మ ధార, పెందుర్తి, ఆనందపురం, పద్మనాభం, విశాఖ గ్రామీణం, అచ్యుతాపురం కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. సెలవురోజు సైతం అనిశా అధికారులు దస్త్రాలను పరిశీలించారు. 14400 కాల్ సెంటర్, ఫోన్లపై ద్వారా వచ్చిన ఫిర్యాదులపై అనిశా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వీటి ద్వారా మ్యుటేషన్లు, భూములపైనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయన్నారు.

విజయనగరం జిల్లా..

విజయనగరం జిల్లాలోని ఆరు తహసీల్దార్ కార్యాలయాల్లో రెండో రోజు ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. విశాఖకు సమీపంలోని మండలాలైన భోగాపురం, డెంకాడ, పూసపాటిరేగ, ఎస్.కోట, కొత్తవలస, జామి తహసీల్దార్ కార్యాలయాల్లో మంగళవారం ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. ఈ సోదాలు...రాత్రి 9గంటల వరకు కొనసానున్నట్లు అధికారులు తెలిపారు.

మొదటి రోజు తనిఖీలు చేపట్టిన కార్యాలయాల్లోనే రెండో రోజూ కొనసాగిస్తున్నారు. ఇద్దరు డీఎస్పీ, 10మంది సీఐలు ఉదయం 9 గంటలకే.. ఆయా కార్యాలయాలకు చేరుకుని దస్త్రాలను పరిశీలిస్తున్నారు. ప్రధానంగా భూ లావాదేవీలు, పట్టాదారు పాసు పుస్తకాలు, ఇంటి స్థలాలు, కుల ధ్రువీకరణ పత్రాల జారీ, సిటిజన్ చార్ట్ అమలు తదితర అంశాలకు సంబంధించిన దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీర్ఘకాలంగా ఉన్న రెవెన్యూ సమస్యలపైనా దృష్టిసారించినట్లు సమాచారం.

లబ్ధిదారులకు అందని పాసుపుస్తకాలు, ఇళ్ల పట్టాలు

మీ సేవల ద్వారా ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పెండింగ్​పై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. మొదటి రోజు తనిఖీల్లో పూసపాటిరేగ మండల తహసీల్దార్ కార్యాలయంలో అన్ని అనుమతులు పూర్తయి. లబ్ధిదారులకు పంపిణీ చేయని 471 పట్టాదారు పాసుపుస్తకాలు, 629 ఇళ్ల పట్టాలను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఎలాంటి కారణం లేకుండా పలు మీ సేవా దరఖాస్తులను కూడా అధికారులు తిరస్కరించినట్లు గుర్తించామన్నారు

ఇదీ చదవండి

తహసీల్దార్​ కార్యాలయాల్లో రెండోరోజూ ఏసీబీ తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details